Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

'కాంగ్రెస్, టిడిపిలకు ఉపఎన్నికల భయం'

తిరుపతి: కాంగ్రెస్, టిడిపిలకు ఉపఎన్నికల భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతో వాయిదాకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందంటున్న ఐఏఎస్‌లు


బలిపీఠం పై మేమా?


మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందంటున్న ఐఏఎస్‌లు
జైలుపాలు చేసి చేతులు దులుపుకుంటోందని ఆవేదన
సీబీఐ కూడా అమర్యాదగా వ్యవహరిస్తోందని ఆరోపణ
శ్రీనివాసరెడ్డి బదిలీపై మండిపడుతున్న ఐపీఎస్‌లు
రాజకీయ లబ్ధి కోసం ఏసీబీ దాడులకు కిరణే తెర తీసి.. 
స్వీయ మనుగడ కోసం ఇప్పుడు వేటు వేశారని వ్యాఖ్యలు
నిజాయతీకి ప్రతిఫలమిదేనా అంటూ ఆవేదన

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కిరణ్ సర్కారు వ్యవహార శైలిపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సొంత రాజకీయ అవసరాల కోసం తమను పావులుగా వాడుకుంటోందని, ఆ క్రమంలో ఏ సమస్యలు వచ్చినా ముందుగా తమనే బలిపశువులను చేస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను తమకు ఆపాదించి నిందితులుగా ముద్ర వేయడం, జైళ్లకు పంపడం, సొంత పార్టీలోని ప్రత్యర్థులపైకి ఉసిగొల్పడం, తర్వాత వారితోనే రాజీ ఫార్ములాలో భాగంగా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం వంటి చౌకబారు పనులకు పాల్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ చర్యలు తమ మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయని, రోజువారీ పాలనపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే ఆస్కారముందని వారంటున్నారు. ఎమ్మార్ కేసయినా, వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల అంశమైనా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు కొందరు మంత్రుల ప్రమేయముందంటున్న మద్యం సిండికేట్ల కేసు విచారణయినా ప్రతి దాంట్లోనూ తమనే బాధ్యులను చేసి, బలిపశువులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసినందుకు కొందరిని,రాజకీయ అవసరాల నిమిత్తం మరికొందరిని, సొంత పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకునేందుకు ఇంకొందరిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తూ పోతోందని సీనియర్ అధికారులు వాపోయారు. ఇంతటి నీచమైన రాజకీయాలను రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ చూడలేదని ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ సొంత అవసరాలకు సివిల్ సర్వీసు అధికారులను బాధ్యులను చేయడం, ఏకంగా కేసులు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం, ఆందోళన కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

కొత్తకోట బదిలీతో కలకలం

తాజాగా మద్యం సిండికేట్ల వ్యవహారం వెనక డొంకను లాగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అదనపు డెరైక్టర్ పదవి నుంచి పూర్తి అప్రాధాన్య శాఖకు అర్ధరాత్రి బదిలీ చేసిన ఉదంతం అధికారుల మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న శ్రీనివాసరెడ్డికి పేరుకు పదోన్నతి ఇచ్చి అనామక పోస్టింగ్‌తో సరిపెట్టారు. బొత్స కుటుంబానికి బినామీ పేర్లతో మద్యం దుకాణాలున్న విషయాన్ని ఆయన బయటపెట్టారు. వారి పేరిట డీడీలు ఎవరిచ్చారు, వారికి బ్యాంక్ గ్యారంటీ ఎవరి ఖాతాల నుంచి వచ్చింది వంటి వివరాలు సేకరించడానికి ప్రయత్నించిన 24 గంటల్లోపే శ్రీనివాసరెడ్డికి బదిలీ బహుమానం లభించింది. బొత్సతో రాజీలో భాగంగా కిరణే తన రాజకీయ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఇంకా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాంగ్రస్ పార్టీలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బొత్సకు మద్యం సిండికేట్లతో లావాదేవీలున్నాయని నిగ్గుదేల్చేందుకు ఏసీబీలో ప్రత్యేక విభాగం (సిట్) ఏర్పాటుకు కిరణే అనుమతినిచ్చారు. విచారణ వేగం పుంజుకోవడం, కిరణ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని పార్టీ అధిష్టానానికి బొత్స ఫిర్యాదు చేయడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీనివాసరెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయన్ను ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం ఐపీఎస్ అధికారులకు ఆగ్రహం తెప్పించింది. శ్రీనివాసరెడ్డిపై వేటును ఏసీబీ చీఫ్ భూపతిబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తనను కూడా ఏసీబీ నుంచి తప్పించాలంటూ ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఆయన లేఖ రాయడం పెను సంచలనం సృష్టించింది.

మంత్రిమండలి నిర్ణయాలను అంటగడుతున్నారు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, లేదా ప్రజా ప్రయోజనార్థం మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ఐఏఎస్‌ల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ కేసులో విచారణ పేరిట సీబీఐ తమను రోజుల తరబడి పిలిచి విచారించడం, తామేదో తప్పు చేశామన్నట్టుగా మీడియాలో కథనాలు రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘నా సర్వీసులో ఏనాడూ చిన్న తప్పిదం చేయలేదు. మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించి నేను జారీ చేసిన జీవోలు బిజినెస్ రూల్స్‌కు లోబడే ఉన్నాయని నిబంధనలను ఉటంకిస్తూ సీబీఐ విచారణాధికారికి వివరించాను. అయినా నాతో ఏదో చెప్పించాలన్న ఉద్దేశంతో నన్ను రోజుల తరబడి పిలిచారు. నేను బిజినెస్ రూల్స్‌కు లోబడి పని చేసినప్పుడు ఎవరి ఒత్తిడితోనో పనేముంటుందని ప్రశ్నించా’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మంత్రివర్గం నిర్ణయాలకు మంత్రులను బాధ్యులను చేయాలే తప్ప తమను కాదని సీబీఐకి చెప్పినా లాభం లేకపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఏదైనా కంపెనీ వల్ల ఉద్యోగాలొచ్చే అవకాశముందని భావిస్తే స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమై రాయితీలివ్వడంపై నిర్ణయం తీసుకుంటుంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ఆ విధంగానే రాయితీలిచ్చాం. ఎస్‌ఐపీబీ నిర్ణయాలను కూడా విచారణాధికారికి చూపించా. అయినా వారి నుంచి స్పందన లేదు. అన్నీ సక్రమంగా జరిగాయని వివరించిన తరవాత కూడా, ‘ఎవరైనా ఒత్తిడి తెచ్చారా?’ అంటూ ప్రశ్నించిన తీరుకు నాలో నేను నవ్వుకున్నా. ఇంతకు మించి మాట్లాడి ప్రయోజనం లేదు’’ అంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు సీబీఐ విచారణ తీరుతెన్నులను కళ్లకు కట్టారు. మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకున్నాక అది ప్రభుత్వానికి సంబంధించినదవుతుందని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయనన్నారు. రాజ్యాంగంలోనూ దీన్ని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.

మా భుజాల మీదుగా జగన్‌కు గురి పెడతారా?
జగన్ కేసులో తమను కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఐఏఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను అమలు చేసిన తమకు అండగా నిలవాల్సింది పోయి, తమపై కేసులు పెట్టేలా సీబీఐని ఉసిగొల్పుతున్నారని ఓ అధికారి ఆరోపించారు. ‘‘దేనికైనా సమయం రావాలి. ఈ ప్రభుత్వం భండారాన్ని అప్పుడు బయటపెడతా. రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో మాపై ఎలాంటి ఒత్తిడి తెచ్చిందీ ఓసారి గుర్తుకు తెచ్చుకొమ్మనండి. ఐఎంజీ కేసులో బాబు నన్ను ఇంటికి పిలిచి మరీ నోట్ ఫైల్ రాయించుకున్నారు. ఇప్పుడేమో మేం దొంగలం, ఆయన ఆణిముత్యం’’ అంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నిర్ణయాల్లో భాగస్వాములైన మంత్రులను వదిలి జగన్‌ను, అధికారులనే టార్గెట్ చేస్తున్న తీరు సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్లడం, మంత్రులకు నోటీసులిచ్చేందుకు దారి తీయడం తెలిసిందే. చివరికిప్పుడు కిరణ్ తన మనుగడ కోసం బొత్సను కాపాడే క్రమంలో తమనే టార్గెట్ చేసి వేధించడం దారుణమని ఐపీఎస్ అధికారి ఒకరు ఆక్షేపించారు. ‘‘బొత్ప కాంగ్రెస్‌లో ఉన్నారు గనక, మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆయన పాత్ర బయటపడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది గనక రాత్రికి రాత్రే దర్యాప్తు అధికారిని మార్చేస్తారా? కాంగ్రెస్ నేతల తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే అధికారులను బలి పశువులను చేస్తారా? మంత్రివర్గం ఆమోదం తెలిపిన నిర్ణయాలను కూడా వారి రాజకీయ అవసరాల కోసం మాకు చుట్టి ఇబ్బందుల పాలు చేస్తారా? దీన్ని ఆటవిక న్యాయమని గాక మరేమంటారు?’’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ప్రశ్నించారు.

రిలయన్స్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లను బ్లాక్ మెయిల్‌చేసి కోట్లు

రాజమండ్రి, న్యూస్‌లైన్ : జననేత జగన్‌మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న అమలాపురం ఎంపీ హర్షకుమార్ తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండేటి చిట్టిబాబు, మట్టా శైలజ హితవు పలికారు. జగన్‌ను అరెస్టు చేయాలన్న హర్షకుమార్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో గడపగడపకూ జగన్ అవినీతి పేరుతో రాజమండ్రిలో ర్యాలీలు నిర్వహించడంపై వారు మండిపడ్డారు. రాజకీయాలోకి రాకముందు హర్షకుమార్ ఆస్తి ఎంత, ఇప్పుడు కూడబెట్టిన ఆస్తులెన్ని అనే విషయం లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు.

హర్ష తన స్థాయిని మరచి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హర్షకుమార్ రాజమండ్రిలో కళాశాలల పేరుతో భూములు ఆక్రమించారని, ఓ ఆశ్రమ నిర్మాణం పేరుతో భూ కబ్జాకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. రిలయన్స్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లను బ్లాక్ మెయిల్‌చేసి కోట్లు గడించారని విమర్శించారు. సఖినేటిపల్లి -నరసాపురం వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకున్న హర్ష తన పదవీకాలంలో కోనసీమకు చేసిన మేలంటూ లేదన్నారు. మద్యం ఎమ్మార్పీ ధర ల ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్న హర్షకుమార్ ఎంపీ ల్యాడ్ నిధులతో జరిగే పనుల కాంట్రాక్టుల్ని తెలుగుదేశం వ్యక్తులకు ఇచ్చి ఆ పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. 

కోటిపల్లి నర్సాపురం రైల్వేలైను ప్రతిపాదనలు అటకెక్కడానికి హర్ష మూలకారకుడని విమర్శించారు. రాజమండ్రిలో కూర్చుని రాజకీయాలు చేసే హర్షకుమార్‌కు నియోజక వర్గం లో ఎవరితోనూ సత్సంబంధాలు లేవని ఆనంద్‌సాగర్, చిట్టిబాబు అన్నారు. జగన్‌కు అశేష జనాదరణ చూసి సహించలేకనే హర్షకుమార్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే శైలి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు.

'బాబూ.. ఢిల్లీ పర్యటన గుట్టు బయటపెట్టు'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనడానికి ఆయన ఢిల్లీ పర్యటనే నిదర్శమని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. విద్యుత్ ధర్నాలో ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించకపోవడం, ఆగమేఘాల మీద హస్తినకు బయలుదేరడం దేనికి సంకేతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ మిమ్మల్ని కూడా పిలిచిందా అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరెవరినీ కలిశారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం హఠాత్తుగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. 

ఏసీబీ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఎవరో తనకు తెలియదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను జూపూడి తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యల ద్వారా సత్తిబాబు తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి రేపు వైఎస్సార్ ఎవరని అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. రాష్ర్టంలో పాలన అస్థవ్యస్తంగా తయారయిందని జూపూడి ఆరోపించారు.

యండగండిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పరిధిలోని యండగండిలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు,కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ ర్యాలీ పాల్గొన్నారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కూడా జగన్‌ వెంట ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యండగండి నుంచి మొదలైన ఈ యాత్ర రామచంద్రాపురం వరకు సాగుతుంది. పామర్రు, సత్యవాడ, ద్రాక్షారామం సెంటర్‌ మీదుగా ఈ ర్యాలీ సాగనుంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర 
ఈ ర్యాలీ సాగుతుంది.

వైఎస్‌ జగన్‌ రాజకీయ హీరో:హరిరామ జోగయ్య

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను పార్టీ నేత హరిరామ జోగయ్య రాజకీయ హీరోగా అభివర్ణించారు. సినిమా హీరోకు..రాజకీయ హీరోకు చాలా తేడా ఉందన్నారు. రాజకీయ హీరో అంటే జగనేన్నారు. 2014లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని జోగయ్య చెప్పారు. జగన్ వెంట ఉండటం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

చంద్రబాబు ఆందోళన హాస్యాస్పదం: గండ్ర

హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ ఛీప్ విప్ గండ్ర వెంకట రమణ అన్నారు.అధికారం కోసం చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయం చర్చించడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు చెప్పారు.

వైఎస్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కుట్ర: జీవన్ రెడ్డి

వైఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ వైఖరి... సొంతపార్టీనే అప్రతిష్ట పాలు చేసేలా ఉందని మాజీమంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సర్కార్ లా ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి చేసామని యూపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే... రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

చంద్రబాబుకు ఎమ్మార్ కు భూకేటాయింపులు, ఆయన కోడలు బ్రహ్మణికి విల్లాల కేటాయింపు, క్విడ్ ప్రో కో కాదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో బాబుపై ఎందుకు విచారణ జరపలేదని, ఇతర రాష్ట్రాల పరిశ్రమలకు భూమిని కేటాయిస్తే తప్పులేంది... మన రాష్ట్రంలో వైఎస్ సర్కార్ చేస్తే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో వైఎస్ ను పొగుడుతూ రాష్ట్రంలో ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు.

'ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం'

మల్కిపురం : త్వరలో 18చోట్ల జరిగే ఉపఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలు ఖాయమని పార్టీ నేత, సినీ నటుడు విజయచందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిపార్టీలు ఎంత డబ్బిచ్చినా తీసుకొని... ఓటు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కే వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలో పార్టీనేత మత్తి జయప్రకాశ్‌ ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్‌ ట్రస్టును విజయచందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Nallapu Reddy Prasanna kumar reddy tour in kovur


మాబోటోళ్ల బాధలు.. మీరు ముఖ్యమంత్రి అయితేనే తీరతాయ్..

ఏం చేత్తాం.. కాంగ్రెసోళ్లు కరెంటు చార్జీలు పెంచారు.. కనీసం కరెంటు ఎప్పుడు ఇత్తారో.. ఎప్పుడు తీత్తారో తెల్వడం లేదు.. మా పిల్లల చదువులకు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాం.. మాబోటోళ్ల బాధలు.. మీరు ముఖ్యమంత్రి అయితేనే తీరతాయ్.. అంటూ మహిళలు యువనేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి మొరపెట్టుకున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని మంగళవారం మొగల్తూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పలువురు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ తీరును ఎండగడుతూనే జగన్‌మోహనరెడ్డిపై వారికి ఉన్న నమ్మకాన్ని చెప్పారు. మొగల్తూరుకు చెందిన కవుదుల రాణి, మాసిలంక పావని, మాణిక్యం వేదిక వద్దకు వచ్చి కరెంటు కష్టాలను ఏకరువు పెట్టారు. జగన్‌మోహనరెడ్డితో వారి ముఖాముఖి ఇలా సాగింది. 

పావని: ఉదయం 6 గంటలకు కరెంట్‌పోతుం ది. సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ రాదు. 
వైఎస్ జగన్: ఏమిటీ.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఉండదా? 
మహిళ: ఉండదు సార్..! అంతేకాదు అర్ధరాత్రి కూడా తీసేస్తారు. పిల్లల చదువులకు ఇబ్బం దులు పడుతున్నాం.
జగన్: మళ్లీ రాత్రి ఎంతసేపు తీస్తారు, అసలు కరెంట్ మీకు ఎంతసేపు ఉంటుంది?
పావని: ఎప్పుడు పోతుందో.. ఎప్పుడొస్తుందో తెలియదు. ఇలాగైతే ఎలా సార్..! మా గురించి మీరే పట్టించుకోవాలి.
నర్సాపురం పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థిని కప్పల ఐశ్వర్య అయితే కరెంటు సమస్యలపై జగన్‌కు వివరించారు.
ఐశ్వర్య: మాది మున్సిపాలిటీ. మాకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4 గంటల వరకు కరెంటు తీసేస్తారు.
జగన్: ఏమిటీ.. టౌన్‌లో కూడా అంతసేపు పవర్‌కట్ ఉంటుందా?
ఐశ్వర్య: అంతేకాదు సార్..! అర్ధరాత్రి కూడా రెండు, మూడు గంటలు కరెంట్ ఉండదు.
జగన్: పట్టణంలో కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా..? 
భీమవరానికి చెందిన ఆకుల సుబ్బలక్ష్మి సైతం కరెంట్ కష్టాలను ఏకరువుపెట్టారు.
సుబ్బలక్ష్మి: కరెంటు సరిగ్గా ఉండదు. మిని మమ్ చార్జీ మాత్రం రూ.150 వసూలు చేస్తారు.
జగన్: ఎంతమ్మా.. మినిమమ్ చార్జీ ఎంత వసూలు చేస్తున్నారు.
సుబ్బలక్ష్మి: మినిమమ్ చార్జీ రూ.150 లే సార్..! కానీ బిల్లులు మాత్రం రూ.600-800 కూడా వస్తాయి. 
జగన్: ఏమిటీ.. రూ.600, రూ.800 కూడానా..?
సుబ్బలక్ష్మి: నెలంతా కష్టపడ్డా కరెంటు బిల్లు కట్టలేని దుస్థితి నెలకొంది సారూ..
జగన్: కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు వైర్లు కాదు.. బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతోంది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేలా ఈ ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నదే చిన్న ఆశ. 
..ఇలా సాగింది. సభలో విద్యుత్తు కష్టాలపై వైఎస్ జగన్‌మోహనరెడ్డికి, మహిళలకు మధ్య చర్చ. అనంతరం సభలో మాట్లాడిన జగన్‌మోహనరెడ్డి ఈ విషయాన్నే ప్రస్తావించారు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియదు గాని బిల్లులు చూస్తే మాత్రం షాక్ కొడతాయని వ్యాఖ్యానించారు.

సీఎం, బొత్సల మధ్య వివాదంతో శ్రీనివాసరెడ్డిపై వేటు


కరెంటు చార్జీలపై రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు


హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కాయి. చార్జీలను దించాలని.. లేదంటే ప్రభుత్వం గద్దె దిగాలంటూ నినదించాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో నిరసన ధ్వనులు మార్మోగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలో ధర్నా చేశారు. ఆందోళనకు దిగిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసు బలగాలు అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిలుపై విడుదల చేశారు. విద్యుత్ చార్జీలు మరో ఐదేళ్లపాటు పెంచేది లేదని 2009 ఎన్నికల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీని వమ్ము చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డగోలుగా చార్జీలు పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాల్లో నిలదీశారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ప్రధాన కార్యాలయాలైన సోమాజీగూడలోని విద్యుత్‌సౌధను పార్టీ నేతలు ముట్టడించారు. 

ఇందులో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జనక్ ప్రసాద్, కె.శివకుమార్, రాజ్‌ఠాకూర్, ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసి అనర్హతకు గురైన 18 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, ఆయా జిల్లాల పార్టీ అడ్‌హాక్ కమిటీల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులూ ధర్నాల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిరోసిన్ దీపాలు, కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జలుమూరుల్లో జరిగిన సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం సబ్‌స్టేషన్ వద్ద పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు రామకృష్ణాపురం విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నాలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, కర్నూలు జిల్లాలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఆందోళనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలోని సాగర్ రోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కిరోసిన్ లాంతర్లతో ర్యాలీ తీశాయి. కరీంనగర్ జిల్లాలో వేములవాడ, చొప్పదండి, ధర్మపురి, మంథని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పులివెందులలో కరెంటు ధర్నాలో సర్కారుపై విజయమ్మ మండిపాటు


పులివెందుల నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘రైతుల కష్టాలు, ఆత్మహత్యలు చూడలేక మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తాను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పా రు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు ఇచ్చారు. దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు రద్దు చేశారు. రైతులకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పారు. వైఎస్ మరణానంతరం ఆయన ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పైగా మోటార్లకు మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు కుట్ర పన్నుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ పులివెందుల ఎస్‌పీడీసీఎల్ డివిజినల్ ఇంజినీర్ కార్యాలయం ముందు విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఈ సందర్భంగా విజయమ్మ తూర్పారబట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ఉచిత విద్యుత్‌ను అమలు చేశారన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో గద్దెనెక్కిన నేటి పాలకులు రైతుల మోటార్లకు మీటర్లు అమర్చి బిల్లులు వసూలుచేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ ధర్నాలో వైఎస్సార్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాడు బాబు, నేడు కాంగ్రెస్.. జనానికి షాకులే


చంద్రబాబు, కిరణ్‌లపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
కరెంటు చార్జీలకు నిరసనగా మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద జగన్ ధర్నా

చంద్రబాబు తొమ్మిదేళ్లలో 8 సార్లు చార్జీలు పెంచారు
బిల్లులు కట్టకపోతే రైతులను జైల్లో పెడతామని, ప్రత్యేక కోర్టుల్లో విచారిస్తామని జీవోలిచ్చారు
పెంచిన ధరలు దించాలని అడిగినందుకు కాల్చి చంపించేందుకు కూడా వెనుకాడలేదు
రోశయ్య, కిరణ్ రెండేసి సార్లు పెంచేశారు
దివంగత నేత వైఎస్ తన సువర్ణయుగంలో కరెంటు చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు
పరిశ్రమలకు తక్కువ ధరకే విద్యుత్ అందజేశారు
త్వరలో జరగబోయేవి మినీ ఎన్నికలు
ఈ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ప్రభుత్వం వచ్చే ఏడాదిలోనే బంగాళాఖాతంలో కలిసిపోతుంది

నరసాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: రాష్ట్ర సర్కారు ఎడాపెడా పెంచేసిన కరెంటు చార్జీలతో స్విచ్చులు ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారో, ఎన్ని గంటలు ఉంటుందో అర్థంగాని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. పేదవాడి నడ్డివిరిచేలా పెంచిన కరెంటు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డి వేలాది మందితో కలిసి ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా గతంలో ఉన్న పరిస్థితి, ఇప్పటి పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలను పెంచకపోవడమేగాక పరిశ్రమలకు ఇచ్చే కరెంటును వరుసగా మూడు సంవత్సరాలు తక్కువ ధరకు ఇచ్చారన్నారు. ఆ సమయంలో క్రిసిల్ ఇచ్చిన రేటింగ్‌లో రాష్ట్ర విద్యుత్ బోర్డు ట్రిపుల్ ఏ ర్యాంకు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. కానీ వైఎస్ తర్వాత గద్దెనెక్కిన రోశయ్య సంవత్సరంలోనే రెండుసార్లు, కిరణ్‌కుమార్‌రెడ్డి సంవత్సరన్నర కాలంలోనే రెండుసార్లు చార్జీలను పెంచారని విమర్శించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలన, వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పరిపాలన దొందూ దొందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన ఈ ధర్నాలతో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు.

రైతులను కాల్పించేందుకు చంద్రబాబు వెనుకాడలేదు..

వైఎస్ కన్నా ముందు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు తన తొమ్మిదేళ్ల హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలను పెంచారని జగన్ గుర్తుచేశారు. చార్జీలను పెంచడమేకాకుండా వాటిని తగ్గించాలంటూ ధర్నా చేసిన రైతులను కాల్చి చంపించేందుకు కూడా ఆయన వెనుకాడలేదని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ఫలానా రైతుకు ఒక్కటంటే ఒక్క పని చేశానని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. కరెంటు బిల్లులు కట్టలేకపోతే రైతులను జైళ్లల్లో పెట్టాలని చంద్రబాబు జీవో నంబరు 89ని విడుదల చేశారని, బిల్లులు కట్టలేని వారిని స్పెషల్ కోర్టులో పెట్టి విచారిస్తామని జీవో నంబరు 60ను జారీ చేశారని పేర్కొన్నారు. అధికారం కోసం చంద్రబాబు నైతిక విలువలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. 

త్వరలో జరిగేవి మినీ ఎన్నికలు..

రాష్ట్రంలోని 18 నియోజకవర్గాల్లో త్వరలో జరిగే ఉప ఎన్నికలను మినీ ఎన్నికలుగా జగన్ అభివర్ణించారు. ఈ 18 చోట్లా ప్రజలిచ్చే తీర్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014 కన్నా ముందే 2013లోనే అది బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందని, సువర్ణయుగం ఏర్పడుతుందని, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు వస్తుందని తెలిపారు.

కరెంటు సరఫరా ఎలా ఉంటోందమ్మా..?

ధర్నా సందర్భంగా జగన్ పలువురు మహిళలతో మాట్లాడి కరెంటు సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ కరెంటు తీస్తున్నారని, మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకూ కట్ చేస్తున్నారని, రాత్రిపూట మరో రెండుమూడు గంటలు కోత పెడుతున్నారని నరసాపురానికి చెందిన బీటెక్ విద్యార్థిని కప్పల ఐశ్వర్య చెప్పారు. మొగల్తూరుకు చెందిన మాసిలంక పావని మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమకు కరెంటే ఉండడం లేదని వాపోయారు. 

జగన్ సమర్థ నాయకుడు: జోగయ్య 

రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ తప్ప సమర్థమంతమైన నాయకులు ఇంకెవ్వరూ లేరని ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చెప్పారు. అసమర్థ నాయకత్వం కింద పనిచేసే కన్నా ఇంట్లో కూర్చోవడం మేలని బయటకు వచ్చేశానని పరోక్షంగా చిరంజీవిని విమర్శించారు. జగన్ సీఎం కావడానికి 2014 దాకా ఆగాల్సిన అవసరం లేదని, ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని, అప్పుడు ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమంలో నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మోషేన్‌రాజు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెరకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

నేడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ప్రముఖుల చేరిక

మాజీ శాసన సభ్యుడు కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు (చినబాబు) మంగళవారం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటి పరిశీలకుడు వెలగల సాయిబాబారెడ్డి తెలిపారు. చినబాబు కుటుంబం నుంచి మూడు తరాల నాయకులు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. చినబాబు తాత జవ్వాది లక్ష్మయ్య నాయుడు రెండు పర్యాయాలు, తండ్రి జవ్వాది శ్రీరంగనాయకులు ఒక పర్యా యం పెనుగొండ నియోజకవర్గ శాసన సభ్యునిగా పనిచేశారు. 1999లో ప్రస్తు త సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పితాని సత్యనారాయణపై స్వతంత్య్ర అభ్యర్థిగా చినబాబు పోటీచేసి గెలుపొందారు.

అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరనున్నారు. చినబాబు చేరికతో ఆ చంట, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పార్టీకి అదనపు బలం చేకూరుతుందని కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, కేంద్ర నిర్వాహక కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మె ల్యే మోచర్ల జోహార్‌వతి, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, స్టీరింగ్ కమిటీ సభ్యులు వగ్వాల అచ్యుతరామారావు, నడపన సత్యనారాయణ, ముచ్చెర్ల శ్రీరామ్, వెలగన శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి పెనుగొండలో ఆయనతో చర్చలు జరిపారు. 

నేడు పీవీఎల్ చేరిక..
ఉండి, న్యూస్‌లైన్: ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ లో చేరనున్నారు. పెద అమిరం నుంచి 50 కార్లతో ర్యాలీగా నర్సాపురం వెళ్లనున్నారు. ఆయన 18 ఏళ్లు యండగండి రూరల్ బ్యాంక్ అధ్యక్షునిగా, 9 ఏళ్లపాటు డీసీసీబీ డెరైక్టర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన ఉండి ఏఎంసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున ఉండి అభ్యర్థిగా పోటీచేసిన ఆయన మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పీవీఎల్ తండ్రి తిమ్మరాజు 18 ఏళ్లు ఆకివీడు సమితి అధ్యక్షుని పనిచేసి డెల్టా ప్రాంతంలో రాజకీయ ఉద్దండునిగా ఖ్యాతి గడించారు. పీవీఎల్ రాకతో పీఆర్పీ శ్రేణులు ఆయనతో పయనించేందుకు సన్నద్ధమవుతున్నాయి. రెండు రోజులు గా నియోజకవర్గ స్థాయిలో తన అనుయాయులతో చర్చించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్ సీపీలో చేరిన రాజేష్ పుత్ర
ఏలూరు: తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ బెజ్జం రాజేష్ పుత్ర సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చే రారు. నర్సాపురం రోడ్‌షోలో జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన ఆయన ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, మీడియా కో-ఆర్డినేటర్ బీవీ రమణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వైఎస్సార్ సీపీలోకి వలసల ప్రవాహం

మొదట్నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. చిరంజీవి కారణంగా వీరు పార్టీని వీడారు. తిరిగి సొంత పార్టీలోకి వచ్చేయండి.. పార్టీ తలుపులు తెరిచే ఉంటాయంటూ గత నెలలో రైతుపోరుబాటకు వచ్చిన సందర్భంగా చంద్రబాబునాయుడు నరసాపురం సభలో ఇచ్చిన పిలుపు ఇది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తే చిరంజీవిని అనుసరించి కాపు సామాజికవర్గమంతా కాంగ్రెస్‌కు అండగా ఉంటుందని అధికార పార్టీ మెగా మంత్రం వేసింది. బాబు ఎత్తులు.. కాంగ్రెస్ జిత్తులు పటాపంచల్ చేస్తూ జిల్లాలోని ఆ సామాజిక వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలుస్తోంది. 

ఇప్పటికే ప్రధాన సామాజిక వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గత వారం రోజులుగా ఊపందుకున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఓ వైపు తెలుగుదేశం కాపులను నిర్లక్ష్యం చేయడం.. మరోవైపు చిరంజీవి సొంత సామాజికవర్గ నమ్మకాన్ని ఒమ్ము చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే వంగవీటి రంగాకుమారుడు రాధ గుంటూరులోని ఓదార్పుయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు పలికారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి మోహన్ కూడా వైఎస్సార్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. 

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయ దురంధరుడిగా పేరొందిన చేగొండి వెంకటహరరామ జోగయ్య (హరిబాబు) సోమవారం నర్సాపురంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దొడ్డిపట్ల గ్రామ మునసబుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జోగయ్య రెండు పర్యాయాలు సమితి ప్రెసిడెంట్‌గా, ఒక పర్యాయం జడ్పీ చైర్మన్‌గా, 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా, 3 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఒకసారి మినహా ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందన్న నానుడి జిల్లాలో ప్రచారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీలలో ఉన్న సమయంలో ఆ పార్టీలు అధికారాన్ని చేపట్టాయి. ఒక పర్యాయం బీజేపీ ఎంపీగా యూవీ కృష్ణంరాజుకు మద్దతు పలికి గెలిపించారు. ఈ నేపథ్యంలో జోగయ్య చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరోవైపు చిరంజీవికి బావమరిది, పాలకొల్లు నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన అల్లు వెంకటసత్యనారాయణ ఇప్పటికే గుంటూరు వెళ్లి ఓదార్పుయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పట్టున్న ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి ఈనెల 4న నర్సాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సోమవారం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా జిల్లాలోని ప్రధాన కాపు నేతలంతా వందలాదిమంది కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ మద్దతును పలకడం విశేషం. ఇప్పటికే జిల్లాలో క్షత్రియ, గౌడ, శెట్టిబలిజ, క్రైస్తవ, మత్స్యకార తదితర అన్ని సామాజిక వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గురుతర పాత్రను పోషిస్తుండగా, తాజాగా చేరికలు ఆ పార్టీని మరింత బలోపేతాన్ని చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

వైఎస్ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీవని, సోనియాగాంధీవని జనాన్ని వంచించడానికి ప్రయత్నిస్తూనే

నమ్మక ద్రోహానికీ, నడమంత్రపు అధికారానికీ ఏదో సంబంధం ఉన్నట్టుంది. లేకపోతే ఇంత చేటు ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు వచ్చేవి కాదు. ఈ రాష్ట్ర ప్రజానీకంపై పగబట్టినట్టు ఇప్పటికే నడి వేసవిలో కోతల మీద కోతలు విధిస్తూ నానా కష్టాలూ పెడుతున్న సర్కారు ఏకంగా రూ.4,442 చార్జీల భారాన్ని మోపి వారిని మరిన్ని అగచాట్లలోకి నెట్టేసింది. రెండున్నరేళ్ల క్రితం కేవలం తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరసగా రెండోసారి అధికారంలోకి తెచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఏలికలకు గుర్తున్నారా? ఆయన అప్పుడూ, అంతకు ముందు 2004లో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? గుర్తుండి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వారి ప్రవర్తన ఇలా ఉండదు. ఒకపక్క వైఎస్ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీవని, సోనియాగాంధీవని జనాన్ని వంచించడానికి ప్రయత్నిస్తూనే ఆ హామీలకు తూట్లుపొడుస్తూ ఇలా పెను భారం మోపడాన్ని ఆ పార్టీ పెద్దలూ, ప్రభుత్వ పెద్దలూ ఎలా సమర్ధించుకుంటారు? జనానికి సంజాయిషీ ఇవ్వాలి. ఈసారి రాష్ట్ర ప్రజలపై కోట్ల రూపాయల మేర భారం మోపడం ఒక్కటే కాదు కాంగ్రెస్ సర్కారు చేసింది... రైతన్నకు వ్యవ సాయం కోసం ఇచ్చే ఉచిత విద్యుత్తుకు సైతం గండికొట్టే కుట్రకు తెరలేపింది. అంతేకాదు... పంచాయతీలకు, కుటీర పరిశ్రమలకు సైతం ఇంతక్రితం లేని చార్జీల పెంపును అంటించారు.

అధిక విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ జరిగిన ఉద్యమంపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో అప్పటి చంద్రబాబు సర్కారు కాల్పులకు తెగించి ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్న ఘటన ఈ రాష్ట్ర ప్రజల స్మృతిపథంనుంచి ఇంకా చెరిగిపోలేదు. ఆనాటి జనకంటక సర్కారు దుశ్చర్యకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాలుపంచుకోవడమే కాదు.. రాష్ట్ర ప్రజలకు అలాంటి కష్టాలు కలగనివ్వకూడదన్న సత్సంకల్పంతో తాము అధికారంలోకొస్తే అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీలు పెంచబోమని 2004 ఎన్నికల్లో వైఎస్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే ఆ హామీని త్రికరణ శుద్ధిగా అమలుచేశారు. 2009 ఎన్నికల్లో వైఎస్ చేసిన బాసలు రెండే రెండు.. రైతులకు రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం, మరో అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీలు పెంచకపోవడం. ఆయన హఠాత్తుగా కనుమరుగైన తర్వాత అధికారంలోకొచ్చిన రోశయ్య ప్రభుత్వమైనా, ఆ త ర్వాత వచ్చిన కిరణ్ ప్రభుత్వమైనా ఈ రెండు వాగ్దానాలనూ నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయి. 9 గంటల విద్యుత్తును నిరాఘాటంగా అమలు చేయడం మాట అటుంచి, రోజులో ఇచ్చే ఏడు గంటల విద్యుత్తును సైతం చీలికలు, పేలికలు చేసి ఇస్తూ అందులో సైతం గంట కోత పెడుతున్నారు. ఎలాంటి వేళలూ పాటించకుండా చిత్తం వచ్చినట్టు మూడు, నాలుగు విడతలుగా ఇస్తున్న ఆ విద్యుత్తువల్ల ఎందుకూ ఉపయోగం లేకుండా పోతోందని రైతాంగం గగ్గోలు పెడుతోంది.

ఆ గోడు విని అర్థంచేసుకుని సమస్య పరిష్కరించే కోరికా, తీరికా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. విద్యుత్తు చార్జీలు పెంచబోమన్న హామీ పరిస్థితీ డిటోయే. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలకు చార్జీలను పెంచడం కొత్తేమీ కాదు. ఇప్పటికి అయిదుసార్లు ప్రజలపై చార్జీల భారం మోపాయి. కానీ, ఈసారి చార్జీలు పెంచడంలో అపర చాణక్యం దాగివుంది. రైతన్నలు ఏడుగంటలు దాటి ఉపయోగించుకునే విద్యుత్తుకు ప్రతి యూనిట్‌కూ రూ.3.25 వసూలు చేయాలని నిర్ణయించారు. ఎత్తిపోతల కింది రైతులకైతే యూనిట్‌కు రూ.3.50 పిండుతారు. అంటే... ఒకపక్క 9 గంటల విద్యుత్తు ఇచ్చేదిలేదని చెప్పడమేకాక, ఇచ్చే ఉచిత విద్యుత్తుకు సైతం ఎగనామం పెట్టదల్చుకున్నారని స్పష్టమవుతున్నది. ఇది లక్షలాదిమంది రైతన్నలకు నమ్మక ద్రోహం తలపెట్టడమే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సామాన్య ప్రజలకు మాత్రమే కాదు... భారీ పరిశ్రమలకూ, చిన్న పరిశ్రమలకూ, చేతివృత్తులకు పెనుముప్పు ఏర్పడింది.

విద్యుత్తు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి వాస్తవం. అయితే, అందుకు ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారమేమిటి? దీర్ఘకాలిక అవసరాలను అంచనావేసుకుని విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వేసిన ప్రణాళికలేమిటి? దివంగత నేత వైఎస్ తన పాలనాకాలంలో డిమాండ్‌కూ, సరఫరాకూ మధ్య అంతరం పెరగకుండా చూశారు. నష్టాల్లో ఉన్న జెన్‌కోకు జవసత్వాలు కల్పించి లాభాలు ఆర్జించేలా తీర్చిదిద్దారు. కేజీ బేసిన్‌లో రిలయన్స్ తవ్వుకుపోతున్న గ్యాస్‌లో మన రాష్ట్రానికి రావలసిన న్యాయమైన వాటాపై చివరివరకూ పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి తొమ్మిది గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులకు 2,722 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ, అవసరమైన గ్యాస్ లభించక అవి 1,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.

ఈ విద్యుత్తు ప్రాజెక్టులకు గ్యాస్ అందజేయడంలో రిలయన్స్ మీనమేషాలు లెక్కిస్తున్నా ఒత్తిడిచేసేవారు లేరు. పైగా ఉత్పత్తి వ్యయానికి అయిదారు రెట్లు లాభం వేసుకుని గ్యాస్ అమ్ముతున్నా దిక్కూ మొక్కూ లేని పరిస్థితి. గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతున్నదంటూ ఆ సంస్థ చెబుతున్నదాంట్లో నిజమెంతో ఆరా తీసేవారుగానీ, ప్రశ్నించేవారుగానీ లేకుండాపోయారు. అపారమైన వనరులు, అత్యున్నతస్థాయి నైపుణ్యం జెన్‌కోకు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి. ఇవన్నీ సరిదిద్దితే విద్యుత్తు చార్జీలను పెంచే అవసరం రాదు సరికదా... వాటిని మరింతగా తగ్గించవచ్చు. కానీ, ప్రభుత్వం వద్ద చార్జీల పెంపు తప్ప మరే పరిష్కారమూ లేనట్టు కనబడుతూనే ఉంది. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ వేసిన రకరకాల భారాలతో నడుం విరిగిన ప్రజలను ఈ విద్యుత్తు చార్జీలు మరింత కుంగదీస్తాయి. అధికార కుమ్ములాటల్లో ఆద్యంతమూ కూరుకుపోయిన పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. అది రాష్ట్ర ప్రజల ప్రారబ్ధం. 

వైఎస్ ఇచ్చిన మాట ఏమైంది?


నరసాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: మరో ఐదేళ్ల వరకూ విద్యుత్ చార్జీలను పెంచేది లేదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ ఇచ్చిన మాటతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా ప్రజలపై రూ.4 వేల కోట్ల కరెంటు చార్జీల భారం మోపారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే వైఎస్ చనిపోయారని, ఆ తర్వాత వచ్చిన పాలకులు సిగ్గులేకుండా చార్జీలను పెంచారని ధ్వజమెత్తారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సోమవారం జగన్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన సభల్లో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం జరిగే ధర్నాలో అందరూ పాల్గొనాలని, రాష్ట్రవ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ ఓటు పాలకులకు కనువిప్పు కావాలి..

‘‘మనం వేసే ప్రతి ఓటు రైతన్నకు వేసే ఓటు, పేదవాడికి వేసే ఓటు.. ఈ ఓటుతో గ్రామాల్లో రైతన్న ఎలా బతుకున్నాడు, పేదవాడు ఎలా బతుకుతున్నాడో పాలకులకు తెలియాలి.. కనువిప్పు కలగాలి. వారికే కాదు రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలకు కూడా కనువిప్పు కావాలి..’ అని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావని, రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి అంతకన్నా కావని చెప్పారు. రైతన్న, పేదవాడు ఒకవైపు ఉంటే కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయు వ్యవస్థ మరోవైపు ఉందని, విలువలు, విశ్వసనీయుత ఒకవైపు ఉంటే వంచనతో కూడిన రాజకీయూలు మరోవైపున నిలిచాయని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేస్తే ప్రజల తరఫున నిలబడినట్లు అవుతుందని అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన వద్దకు వచ్చిన నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్‌కు చెప్పానన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే పదవులు పోతాయని తెలిసినా విలువల కోసం కట్టుబడి ఓటు వేశాడని చెప్పారు. 

‘‘రాజకీయాల్లో పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ప్రతి పేదవాడు మనవైపు చూస్తున్నాడు.. ప్రతి రైతన్నా మనవైపు చూస్తున్నాడు.. ఇలాంటి రాజకీయు వ్యవస్థలో ఒక తులసి మొక్కలా మనం బయటకు రావాలి’’ అని చెప్పినట్లు గుర్తు చేశారు. చెడిపోయిన రాజకీయు వ్యవస్థలో మళ్లీ విలువలను తీసుకురావాలని, పలానా వాడు తమ నాయకుడని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకునేలా ఉండాలని ప్రసాద్‌తోపాటు 17మంది ఎమ్మెల్యేలకు చెప్పానని తెలిపారు. నా మాటను గౌరవించి వారంతా పదవులు త్యాగం చేశారన్నారు. రైతుల, పేదల పక్షాన నిలబడ్డ ఆ ఎమ్మెల్యేలను ఆశీర్వదించాలని కోరారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హరిరామజోగయ్య

నరసాపురంలో మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జోగయ్యతోపాటు పలువురు నేతలు, వందలాది మంది కార్యకర్తలు పార్టీలోకి చేరారు.

కుష్ఠు రోగులను పలకరిస్తూ..

రుస్తుంబాదలో ఉన్న లెప్రసీ కాలనీ వద్ద కుష్ఠు రోగులు బయటకు వచ్చి జగన్ వాహనాన్ని ఆపారు. ఆయన కిందకు దిగి వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రోగులను ఆలింగనం చేసుకుని ముద్దాడారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ తమ వద్దకు ఏ నాయకుడూ రాలేదని, తమును పలుకరించే వారే కరువయ్యూరని వారు విలపించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడవద్దని జగన్ వారిని ఓదార్చారు. అనంతరం సీతారామపురం వంతెన, కొత్తపేటలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రామన్నపాలెం, పసలదీవిలో గీత వృత్తి చేసే కుటుంబాన్ని పలుకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జెట్టిపాలెం, పసలదీవి, మెట్టిరేవు, కేపీ పాలెం వరకూ రోడ్ షో నిర్వహించారు. జగన్ వెంట నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోషేన్‌రాజు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు చెరకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు, పార్టీ జిల్లా పరిశీలకులు చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.


అడుగడుగునా ఆదరణ..

ఉదయం 10 గంటలకు నరసాపురం పట్టణంలో రోడ్‌షో ప్రారంభించిన జగన్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సాయినాథ్ ప్రసాద్ నివాసం నుంచి బయలుదేరిన జగన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లూథరన్ చర్చికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టింది. దారి పొడవునా మహిళలు, యువకులు ఆయన వాహనాన్ని ఆపి చేయి కలపడానికి ప్రయత్నించారు. ఎవరినీ కాదనకుండా జగన్ అందరికీ అభివాదం చేస్తూ, చేయి కలుపుతూ ముందుకు సాగారు. మధ్యలో వనుమలమ్మ గుడి సమీపంలో చేనేత కార్మికుల్ని కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్‌పై రాజకీయ పోరుకూ సిద్ధం: అసదుద్దీన్ ఒవైసీ

‘‘సంగారెడ్డిలో జరిగిన ఘర్షణలు గుజ రాత్ ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి. వీటిలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు పోషించిన పాత్రపైనా విచారణ జరగాలి. ఎమ్మెల్యేతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నందున ఆయనను కాపాడజూస్తే సహించేది లేదు. అవసరమైతే కాంగ్రెస్‌పై రాజకీయ పోరాటానికి కూడా మజ్లిస్ సిద్ధం! శాంతిభద్రతల సమస్య ఇలాగే కొనసాగితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మైనారిటీలు గట్టి తీర్పునిస్తారు’’ అని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో మార్చి 29 రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనలు ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి మేల్కొలుపు వంటివన్నారు. వీటిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని, కేసుల విచారణకు సంగారెడ్డిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ అంశం, అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. దాంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. కాంగ్రెస్‌కు ప్రజలు అధికారమిచ్చింది 2014 వరకేనని గుర్తుంచుకోవాలి. తక్షణం ఆత్మవిమర్శ చేసుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని పాలనపై దృష్టి పెట్టాలి. చాలినన్ని బలగాలు లేకే అల్లర్లను సకాలంలో నియంత్రించలేకపోయామంటూ పోలీసులు తప్పించుకోజూస్తున్నారు. బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణం విధులనుంచి తప్పించాలి. విచారణ పేరిట అదుపులోకి తీసుకున్న అమాయకులను విడుదల చేయాలి. బాధితులకు 2009 నాటి కేంద్ర ఉత్తర్వుల మేరకు పరిహారమివ్వాలి’’ అని డిమాండ్ చేశారు.

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More