కాంగ్రెస్‌పై రాజకీయ పోరుకూ సిద్ధం: అసదుద్దీన్ ఒవైసీ

‘‘సంగారెడ్డిలో జరిగిన ఘర్షణలు గుజ రాత్ ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి. వీటిలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు పోషించిన పాత్రపైనా విచారణ జరగాలి. ఎమ్మెల్యేతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నందున ఆయనను కాపాడజూస్తే సహించేది లేదు. అవసరమైతే కాంగ్రెస్‌పై రాజకీయ పోరాటానికి కూడా మజ్లిస్ సిద్ధం! శాంతిభద్రతల సమస్య ఇలాగే కొనసాగితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మైనారిటీలు గట్టి తీర్పునిస్తారు’’ అని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో మార్చి 29 రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనలు ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి మేల్కొలుపు వంటివన్నారు. వీటిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని, కేసుల విచారణకు సంగారెడ్డిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ అంశం, అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. దాంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. కాంగ్రెస్‌కు ప్రజలు అధికారమిచ్చింది 2014 వరకేనని గుర్తుంచుకోవాలి. తక్షణం ఆత్మవిమర్శ చేసుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని పాలనపై దృష్టి పెట్టాలి. చాలినన్ని బలగాలు లేకే అల్లర్లను సకాలంలో నియంత్రించలేకపోయామంటూ పోలీసులు తప్పించుకోజూస్తున్నారు. బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణం విధులనుంచి తప్పించాలి. విచారణ పేరిట అదుపులోకి తీసుకున్న అమాయకులను విడుదల చేయాలి. బాధితులకు 2009 నాటి కేంద్ర ఉత్తర్వుల మేరకు పరిహారమివ్వాలి’’ అని డిమాండ్ చేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More