Showing posts with label leader's. Show all posts
Showing posts with label leader's. Show all posts

'కాంగ్రెస్, టిడిపిలకు ఉపఎన్నికల భయం'

తిరుపతి: కాంగ్రెస్, టిడిపిలకు ఉపఎన్నికల భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతో వాయిదాకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

బొత్సకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి: గట్టు

హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం మాఫియా కుంభకోణాన్ని మాయం చేసే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అధికార కాంగ్రెస్‌ పెద్దలు ప్రభుత్వ సంస్థల్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు.

సీఎం, పిసిసి చీఫ్‌లమధ్య అభిప్రాయ బేధాలవల్ల అధికారులు బలవుతున్నారని ఆయన అన్నారు. టిడిపి నేతలు కాంగ్రెస్‌తో గల్లీలో కొట్లాడుతూ, ఢిల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని గట్టు ఎద్దేవా చేశారు. లిక్కర్‌ కుంభకోణంలో కూరుకుపోయిన బొత్సకు ఎలాంటి నైతికత వున్నా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

'దమ్ముంటే ఉప ఎన్నికలు వెంటనే జరపాలి'


హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీకి దమ్మూ, ధైర్యం ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లోగా ఉప ఎన్నికలు జరిపించాలని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేని అధికార పక్షం ఎన్నికల్ని వాయిదా వేయాలని చూస్తోందని విమర్శించారు. చరిత్రలు చెప్పుకోవటం కాదని...విలువలు ముఖ్యమని అన్నారు. 

కాంగ్రెస్‌, టిడిపి నీచ రాజకీయాలు చేస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 8 కోట్ల మంది ప్రజలు సిగ్గుపడేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 18 స్థానాలు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచు కుంటుందని శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

x mp girijala joins ysrcp

మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పర్యటిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకట స్వామినాయుడికి కండువా వేసి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పోరాటమే తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేసిందని ఈ సందర్భంగా వెంకట స్వామినాయుడు అన్నారు. "బెంజి తెల్సూ.. గంజీ తెల్సని".. చిరంజీవి మోసం చేశారన్నారు.

Jupudi speaks to media on power charges hike

వైఎస్‌ జగన్‌ రాజకీయ హీరో:హరిరామ జోగయ్య

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను పార్టీ నేత హరిరామ జోగయ్య రాజకీయ హీరోగా అభివర్ణించారు. సినిమా హీరోకు..రాజకీయ హీరోకు చాలా తేడా ఉందన్నారు. రాజకీయ హీరో అంటే జగనేన్నారు. 2014లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని జోగయ్య చెప్పారు. జగన్ వెంట ఉండటం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

సమరశంఖం... నేటి నుంచే ప్రచారభేరి

రామచంద్రపురం నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక పోరులో ఎన్నడో తన అభ్యర్థిని ఖరారు చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారంలోనూ అదేరీతిలో ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తుండగా పార్టీ శ్రేణుల ఉత్తేజాన్ని శిఖరస్థాయికి చేరుస్తూ గురువారం నుంచి పార్టీ అధ్యక్షులు, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. కోవూరు ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న 18 నియోజకవర్గాల్లోనూ అంతకు మించిన గెలుపు తథ్యమన్న నిండు నమ్మకంతో ఉంది.

రామచంద్రపురంలోనూ అదే సమరోత్సాహంతో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతుసంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై విలువలకు కట్టుబడి అవిశ్వాసానికి ఓటేసి పదవి కోల్పోయిన బోస్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వస్తున్న జగన్ పర్యటన బుధవారం రాత్రి ఖరారైంది. అనేక ప్రలోభాలను సైతం లెక్కచేయకుండా, పదవిని తృణప్రాయంగా వదులుకున్న బోస్ కోసం రామచంద్రపురంలో జగన్ సమరశంఖం పూరించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన జగన్ దానికి కొనసాగింపుగా రామచంద్రపురంలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

‘జగన్ మావాడు’ అంటున్న జనం...
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో గుండె పగిలి జిల్లాలో 75 మంది అభిమానులు మరణించగా 18 రోజులు జిల్లాలోనే ఉండి ప్రతి కుటుంబాన్నీ ఓదార్చిన జగన్ ఆ తరువాత కూడా జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నానంటూ’ ఉరికి వచ్చి అండగా నిలబడుతున్నారు. కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. తుపానుతో నష్టపోయిన రైతుల పలకరింపునకు, కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతన్నలకు దన్నుగా నిలిచేందుకు, ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబాల కన్నీటిని తుడిచేందుకు, ఎన్నో జిల్లాలకు జలవరం కానున్న పోలవరం ప్రాజెక్టు సాధనకు చేపట్టిన హరితయాత్ర కోసం, నిన్నగాక మొన్న కోనసీమలో అంబేద్కర్ విగ్రహాలకు అపచారం జరిగినప్పుడు, పోలీసు దెబ్బలకు మృతి చెందిన యానాం రీజెన్సీ కార్మికనేత కుటుంబాన్ని పరామర్శించేందుకు, పల్లం అగ్నిబాధితుల వ్యథను కళ్లారా చూసేందుకు... ఇలా జగన్ పదే పదే జిల్లాలో కాలిడుతూనే ఉన్నారు. కష్టంలో, నష్టంలో జనంతో మమేకం అవుతూనే ఉన్నారు.

అందుకే జిల్లావాసులు ‘జగన్ మావాడు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మా ఆత్మబంధువు. మా పాలిట ఆశాకిరణం’ అని పరిగణిస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా నిండు హృదయంతో, అవధులు లేని ఆప్యాయతను పంచుతున్నారు.

ఎదురు చూస్తున్న గ్రామాలు
గత పర్యటనలకు భిన్నంగా జగన్ ఈసారి రాజకీయ సమరంలో భాగంగా, ఉపపోరులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, బోస్ గెలుపును నల్లేరుపై నడకగా మార్చేందుకు జిల్లాకు రానున్నారు. గురువారం నుంచి శనివారం వరకు నియోజకవర్గంలోని కె.గంగవరం, రామచంద్రపురం, రామచంద్రపురం టౌన్, కాజులూరు మండలాల్లో జగన్ పర్యటించనున్నారు. ఆయన రాక కోసం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. కాగా, పశ్చిమ గోదావరి నుంచి జగన్ ఈతకోట, రావులపాలెంల మీదుగా బుధవారం అర్ధరాత్రి 12.40గంటలకు రామచంద్రపురం చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేత కొవ్వూరి త్రినాధరెడ్డి ఇంటి వద్ద మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొల్లి నిర్మలకుమారి, కర్రి పాపారాయుడు తదితర నాయకులు స్వాగతం పలికారు.

ఎమ్మార్ కేసులో అసలు దోషి చంద్రబాబే!

ముందు ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలి
ఎమ్మార్ కేసుపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి డిమాండ్
చంద్రబాబే కారుచౌకగా ఎమ్మార్‌కు భూములు కట్టబెట్టారు
చేసిందంతా బాబు.. విచారణ వైఎస్‌పైనా?
కాంగ్రెస్ సర్కారే వైఎస్‌ను దోషిగా నిలబెట్టే యత్నాలు బాధాకరం
అధికారులు, మంత్రుల ప్రతిపాదనల మేరకే వైఎస్ నిర్ణయాలు తీసుకున్నారు కదా...
అలాంటప్పుడు క్విడ్ ప్రో కో ప్రసక్తి ఎందుకు వస్తుంది?
కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమానుల్ని లక్ష్యంగా చేసుకొని కుట్రలు
జగన్‌ను దోషిగా చూపేందుకు వైఎస్‌పై నిందలు తగదు 
ముందుగా ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలి 
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి డిమాండ్ 


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపుల్లో అసలు దోషి అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని వదిలిపెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మార్ కేసులో అసలు దోషి చంద్రబాబేనని, ముందుగా ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్‌కు ఎకరాకు రూ.29 లక్షల చొప్పున కారుచౌకగా 530 ఎకరాల భూమిని కేటాయించింది బాబు కాదా? అని ప్రశ్నించారు. 

బుధవారమిక్కడ సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబును వదిలి వైఎస్సార్‌ను దోషిగా నిలబె ట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయడం బాధ కలిగిస్తోంది. రాష్ట్రంలో వైఎస్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ ఎంతగానో మెచ్చుకొని.. యూపీ ఎన్నికల్లో వాటిని ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే యూపీని ఏపీ మాదిరిగా మారుస్తామని ప్రకటించారు’ అని గుర్తుచేశారు. రాహుల్ మెచ్చుకున్న వైఎస్ నిర్ణయాలు, కార్యక్రమాలను రాష్ట్ర నేతలు తప్పుగా చూడటం ఆశ్చర్యకరమన్నారు. 

తెర వెనుక లబ్ధి చంద్రబాబుకే..
‘పారిశ్రామికాభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానాల ప్రకారమే రాజశేఖరరెడ్డి ప్రోత్సాహకాలు కల్పించారు. సిమెంటు, ఫార్మాసూటికల్స్ వంటి సంస్థలకు రాయితీలు ఇచ్చారు తప్ప నిబంధనలకు భిన్నంగా ఏమైనా నిర్ణయాలు చేశారా?’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రోశయ్య కమిటీ అన్నిటినీ అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సుల మేరకే.. వైఎస్ సర్కారు ఆయా విధానాలను కొనసాగించిందన్నారు. వైఎస్సార్‌కు రాజకీయ వారసులం తామేనని చెబుతూ.. అదే నేతను ఆశ్రీత పక్షపాతిగా చిత్రీకరించడం ఎంతవరకు సబబన్నారు.

‘అధికారులు, మంత్రులు చేసిన ప్రతిపాదనల ప్రకారమే వైఎస్ నడిచారు కదా? అలాంటప్పుడు క్విడ్ ప్రో కో అనే ప్రసక్తి ఎందుకు వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. తెరవెనుక లబ్ధి అనేది చంద్రబాబుకే వర్తిస్తుందని చెప్పారు. ‘బాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఎమ్మార్‌కు 530 ఎకరాలు చౌకగా అప్పగించారు. అంతకు మూడేళ్ల ముందు ఆయన అక్కడే ఉన్న తన భూమిని ఎకరా రూ.3 కోట్లకు అమ్ముకున్నారు. 

అదే ప్రాంతంలో ఎమ్మార్‌కు ఎకరా రూ.29 లక్షల చొప్పున కట్టబెట్టారు. తద్వారా ఆ సంస్థకు రూ.370 కోట్ల లబ్ధి చేకూర్చారు. అందుకు ప్రతిగా చంద్రబాబు మేనకోడలు బ్రాహ్మణికి ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో 5 వేల గజాల విల్లా స్థలం గజం రూ.5 వేలకే దక్కింది. ఇది తెరవెనుక లావాదేవీ కాదా? క్విడ్ ప్రో కో కాదా’ అని నిలదీశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో గజం ధర రూ.25 వేలకు పైగా ఉండగా.. రూ.5 వేలకే చంద్రబాబు మేనకోడలు బ్రాహ్మణికి ఇచ్చారంటే దానర్థం క్విడ్ ప్రో కో కాదా అని ప్రశ్నించారు.

అంతా బాబు చేస్తే.. వైఎస్ నిర్ణయాలపై విచారణా?
ఎమ్మార్ కేసు విచారణ కోర్టు ఆదేశాలతో జరుగుతున్నా.. కేసు వేసిన శంకర్రావు కాంగ్రెస్ వ్యక్తేనని జీవన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ను అప్రతిష్టపాల్జేస్తే అది కాంగ్రెస్‌కే అంటుతుందన్నారు. ‘గతంలో ఇండియా సిమెంటుకు డిఫర్‌మెంటు కింద రూ.260 కోట్లకు మినహాయింపులు ఇవ్వడంతోపాటు ఇతర రాయితీలూ చంద్ర బాబు ఇచ్చారు.

వాటిని వదిలేసి వైఎస్ నిర్ణయాలపైనే విచారణలు సాగుతున్న వైనం దురదృష్టకరం. కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమానులను పార్టీకి దూరం చేసేలా కుట్రపూరిత వ్యవహారాలూ నడుస్తున్నాయి’ అని చెప్పారు. వై.ఎస్.జగన్‌ను దోషిగా చూపించేందుకు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను ఎలా తప్పుబడతారన్నారు. జగన్ తప్పుచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, వైఎస్‌పై నిందలు వేయడమే బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆ నిర ్ణయాలు తప్పనో, తెరవెనుక లావాదేవీలనో వ్యాఖ్యానిస్తున్న మంత్రులు.. ఆరోజుల్లో ఫైళ్లు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాటిపై ఎందుకు వ్యతిరేకంగా రాయలేదని ప్రశ్నించారు.

'ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం'

మల్కిపురం : త్వరలో 18చోట్ల జరిగే ఉపఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలు ఖాయమని పార్టీ నేత, సినీ నటుడు విజయచందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిపార్టీలు ఎంత డబ్బిచ్చినా తీసుకొని... ఓటు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కే వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలో పార్టీనేత మత్తి జయప్రకాశ్‌ ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్‌ ట్రస్టును విజయచందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎల్లో మీడియా బురద జల్లుతోంది: బాజీరెడ్డి

హైదరాబాద్ : వైఎస్ఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఎల్లో మీడియా సిగ్గు, ఎగ్గూ లేకుండా బురద జల్లుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. మీడియాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందని ఆయన అన్నారు. జగన్ పై కొన్ని జాతీయ పత్రికల్లో కూడా అసత్య కథనాలు రాస్తున్నారని...చంద్రబాబు తొత్తులు ఆ పత్రికల్ని కలుషితం చేస్తున్నాయని బాజీరెడ్డి మండిపడ్డారు. ఏం చేశారని జగన్ అరెస్ట్ అవుతారని, ఆయన చేసిన తప్పేంటని బాజీరెడ్డి ప్రశ్నించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తోట గోపి

తాడేపల్లిగూడెం ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం నుంచి ముత్యాలపల్లికి ర్యాలీగా వచ్చిన ఆయన తన అనుచరులతో సహ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న జగన్‌ తాడేపల్లిగూడేం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తోట గోపికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.

03/04/2012 jagan tour images





 

Nallapu Reddy Prasanna kumar reddy tour in kovur


కరెంటు చార్జీలపై రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు


హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కాయి. చార్జీలను దించాలని.. లేదంటే ప్రభుత్వం గద్దె దిగాలంటూ నినదించాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో నిరసన ధ్వనులు మార్మోగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలో ధర్నా చేశారు. ఆందోళనకు దిగిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసు బలగాలు అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిలుపై విడుదల చేశారు. విద్యుత్ చార్జీలు మరో ఐదేళ్లపాటు పెంచేది లేదని 2009 ఎన్నికల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీని వమ్ము చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డగోలుగా చార్జీలు పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాల్లో నిలదీశారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ప్రధాన కార్యాలయాలైన సోమాజీగూడలోని విద్యుత్‌సౌధను పార్టీ నేతలు ముట్టడించారు. 

ఇందులో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జనక్ ప్రసాద్, కె.శివకుమార్, రాజ్‌ఠాకూర్, ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసి అనర్హతకు గురైన 18 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, ఆయా జిల్లాల పార్టీ అడ్‌హాక్ కమిటీల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులూ ధర్నాల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిరోసిన్ దీపాలు, కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జలుమూరుల్లో జరిగిన సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం సబ్‌స్టేషన్ వద్ద పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు రామకృష్ణాపురం విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నాలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, కర్నూలు జిల్లాలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఆందోళనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలోని సాగర్ రోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కిరోసిన్ లాంతర్లతో ర్యాలీ తీశాయి. కరీంనగర్ జిల్లాలో వేములవాడ, చొప్పదండి, ధర్మపురి, మంథని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

మానసిక వ్యాధిగ్రస్తుడు రాసిన రాతలు పట్టుకొని మాట్లాడటం

దమ్ముంటే మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శైలజానాథ్, కొండ్రు మురళిలు రాజీనామా చేసి గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దయతో గెలవలేదు అనుకుంటే తమ సవాల్ ని స్వీకరించాలని ఆమె అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. పిచ్చిమాటలు కట్టిపెట్టి సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులకు జవాబు చెప్పాలని సలహా ఇచ్చారు. 

మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారాలపై విచారణ చేస్తే ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటారన్నారు. వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై ప్రభుత్వ జవాబు ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరపున స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ చార్జిషీటులో వైఎస్ పేరును 30 సార్లు ప్రస్తావించినా మంత్రులెందుకు మాట్లాడటంలేదని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టుకు జవాబు చెప్పవలసిన బాధ్యత మంత్రులపై ఉన్నా జగన్ ని ఎందుకు విమర్శిస్తున్నారని ఆమె అడిగారు. రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. 

మానసిక వ్యాధిగ్రస్తుడు రాసిన రాతలు పట్టుకొని మాట్లాడటం మంచిది కాదన్నారు. జగన్ వెంట ఉండే నేతలను విమర్శించే మీరు రోశయ్య గారి కోళ్ల ఫారంలో కోళ్లా, కిరణ్ కుమార్ రెడ్డి గారి కోళ్ల ఫారంలో కోళ్లా లేక సోనియా గాంధీ పౌల్ట్రీలో కోళ్లా చెప్పాలని నిలదీశారు.

Janak Prasad Addressed Media meet


చంద్రబాబువి పగటి కలలు: బాలినేని

ఒంగోలు : రాబోయే ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ప్రసన్నాంజనేయస్వామి తిరునాలలో పాల్గొన్న ఆయన అధికారంలోకి వస్తానని, విగ్రహాలు తొలగిస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని చమత్కరించారు. చంద్రబాబు, టిడిపి ఎప్పటికీ అధికారంలోకి రాదని బాలినేని ఎద్దేవా చేశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం నియోజకవర్గం పర్యటనSchedule

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం నియోజకవర్గం పర్యటన ను విజయవంతం చేయాలని పార్టీ వర్గాలకు పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్ రాజు పిలుపు నిచ్చారు. ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగించుకుని ఆదివారం సాయంత్రం బయలుదేరి విజయవాడ, హనుమాన్‌జంక్షన్, ఏలూరు, తణుకు, మార్టేరు మీదుగా రాత్రికి నరసాపురం చేరుకుంటారని తెలి పారు. 

2, 3, 4 తేదీల్లో నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం హనుమాన్ జంక్ష న్ వద్దకు పెద్ద ఎత్తున పార్టీ నే తలు, కార్యకర్తలు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలకాలన్నారు. 2న మొగల్తూరు మండలం, 3, 4న నరసాపురం మండలంలో పర్యటిస్తారు. 4 సాయంత్రం నరసాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో ఈ నెల 13, 14, 15, 16 తేదీల్లో జగన్ పర్యటిస్తారని చెప్పారు. 

ఇతర పార్టీల నేతల చేరికతో పెరగనున్న బలం 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరటంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని కొయ్యే మోషేన్‌రాజు తెలిపారు. చిరంజీవి కాపులను మాయచేసి స్వార్ధపూరిత రాజకీయాలకు వాడుకున్నారని గ్రహించిన పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తు న్నారని చె ప్పారు. 2న మాజీ ఎంపీ హరిరామజోగయ్య, తాడేపల్లిగూడెంకు చెందిన తోట గోపి జగన్ సమక్షంలో పార్టీలో చేరతారన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 'అల్లు'

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా అల్లు వెంకట సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చార్జిషీటు సుప్రీం ధిక్కారమే: సోమయాజులు

ఎఫ్‌ఐఆర్ పూర్తి కాకుండా చార్జిషీటు దాఖలు చేయడమా
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు తప్పుల తడక. అంతేకాదు.. అది సుప్రీంకోర్టు ధిక్కారం కిందకు వస్తుంది, ఎఫ్‌ఐఆర్ పూర్తి కాకుండా చార్జిషీటు ఎలా దాఖలు చేస్తారు? ఈ విషయాన్ని మేం న్యాయస్థానంలో ప్రశ్నిస్తాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. ఈ కేసు చార్జిషీటులో ఏ1 నిందితుడిగా పేర్కొన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్క సెకనైనా విచారించారా అని సీబీఐని సూటిగా ప్రశ్నించారు. చార్జిషీటులో ఏ ఒక్క మంత్రినీ, అధికారులనూ ప్రస్తావించకపోవడం ఆ సంస్థ పనితనానికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, వాసిరెడ్డి పద్మలతో కలిసి శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ వైఖరిని ఎండగట్టారు. ‘జగన్ కేసులో సీబీఐ విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది.

90 రోజుల్లో చార్జిషీటు వేయకపోతే బెయిల్ వస్తుంది. ఆయన్ను జైల్లో కొనసాగించాలనే దుష్ట ఆలోచనతో సీబీఐ హడావుడిగా చార్జిషీటు దాఖలు చేసింది’ అని అన్నారు. కానీ ‘సీఆర్‌పీసీ 167వ సెక్షన్ ప్రకారం తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేయాలే కానీ.. చార్జిషీటు ముఖ్యం కాదు. చార్జిషీటు వేయడమనేది విచారణ పూర్తయిందనడానికి ఒక సంకేతం మాత్రమే. కచ్చితంగా అలా చేసి తీరాలని చట్టంలో ఎక్కడా లేదు’ అని తెలిపారు. 

విచారణ ప్రారంభమే కాలేదు!

‘నా లెక్క ప్రకారం ఈ కేసులో విచారణే ప్రారంభం కాలేదు. నిన్న (శుక్రవారం) సుప్రీంకోర్టు సంబంధిత మంత్రులు, అధికారులను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ.. నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు తమకు అందలేదని సీబీఐ కూడా చెప్పడానికి లేదు. నోటీసులను మంత్రులు, సీబీఐ అధికారులు అందుకున్నారు. ఈ విషయమై వారికి సుప్రీంకోర్టు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. వారు సుప్రీంకోర్టుకు సమాధానమివ్వాల్సి ఉంది. ఎఫ్‌ఐఆరే పూర్తి కానపుడు అసలు దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? ఏ రకంగా చార్జిషీటును పూర్తి చేయగలిగారు? ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు, దురదృష్టం ఏమిటంటే ఇది కోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన విచారణ మాత్రమే తప్ప కోర్డు పర్యవేక్షణలో జరుగుతున్న సీబీఐ విచారణ కానే కాదు, ఈ విచారణ సీబీఐ అధిపతుల (బాసుల) పర్యవేక్షణలో జరుగుతోంది. వారి అధిపతులు అంటే యూపీఏ ప్రభుత్వం. ఢిల్లీలో కూర్చుని వాళ్లేం చెబితే ఆ ప్రకారమే చార్జిషీటును దాఖలు చేస్తున్నారు. వాళ్లు ఎలా ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేయమంటే అలా చే స్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉందా’ అని సోమయాజులు విస్మయం వ్యక్తం చేశారు. ‘మా బాసులు చెప్పారు.. మేం విచారణ జరిపాం... జగన్‌ను అప్రదిష్టపాలు చేశాం. టీవీల్లోనూ, పత్రికల్లోనూ ప్రచారం వచ్చింది. అది చాలు’ అనే విధంగా సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అసలు ఎఫ్‌ఐఆర్‌లో మంత్రులు, అధికారులను చేర్చకుండా చార్జిషీటును ఎలా ఫైల్ చేశారనేదే ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ‘ఇది ఒక రకంగా కోర్టు ధిక్కారం అవుతుంది. దీనిని కచ్చితంగా ప్రశ్నిస్తాం, అసలు ఇది ఏ తరహా విచారణ..? ఎందుకిలా సాగుతోంది? ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద కాంగ్రెస్, టీడీపీ నాయకులు పి.శంకర్రావు, అశోక్ గజపతిరాజు, కె.ఎర్రన్నాయుడు వేసిన కేసులో ప్రధానంగా పేర్కొన్నది 26 జీవోలను. ఈ జీవోల మూలంగానే కొందరికి ఫలితం దక్కింది. అందులో నుంచి కొంత ప్రతిఫలం జగన్‌కు వెళ్లింద ని వారు ఆరోపించారు. వాళ్లు వేసిన రిట్‌లోనే తొలి పది మంది ప్రతివాదుల్లో ఒకటో ప్రతివాది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే రెండో ప్రతివాది హోం శాఖ కార్యదర్శి, తదుపరి ఎంతో మంది పేర్లను పేర్కొన్నారు. జగన్ పేరు 52 వ ప్రతివాదిగా మాత్రమే ఉంది. సీబీఐ కోర్టులో చార్జీషీటు వేసేముందు 26 జీవోలకు కారకులైన మంత్రులు, అధికారులను ఎక్కడైనా విచారించారా? ఒక జీవోపై కోర్టులో కేసు వచ్చినపుడు అడ్వొకేట్ జనరల్ హాజరై దానిపై ప్రభుత్వం తరపున వాదిస్తారు. 

అలాంటిది ఏకంగా 26 జీవోలపై ఆరోపణలు వస్తే అడ్వొకేట్ జనరల్ కాదు కదా.. కనీసం ప్రభుత్వం తరపున ఒక్క న్యాయవాది కూడా వెళ్లి వాదించని విచిత్ర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. గత 56 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రజల ఆస్తులను భారీగా దోపిడీ చేయడానికి అవకాశం కల్పించాయని చెబుతున్న ఆ జీవోలు సక్రమమైనవా? అక్రమమైనవా? అనేది ప్రభుత్వం చెప్పాలి కదా! అడ్వొకేట్ జనరల్ ఈ విషయంలో కనీసం నోటీసులు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కేసు బహుశా ఇదొక్కటే. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 జీవోలపై కాంగ్రెస్-టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి ప్రతివాదులుగా అరడజను మంది కార్యదర్శులను చేరిస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎన్నడూ చూడలేదు. జీవోలకు బాధ్యులెవరో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. అసలు ఫలం లేని చోట ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది’ అని నిలదీశారు. సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్న వ్యక్తులు ఏ ఒక్కరూ ముద్దాయిలు కారని పేర్కొన్నారు. ‘వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసులో సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు ముద్దాయిలు, కానీ వారి పేర్లు చార్జిషీటులో లేవు. అలాగని వారిని ముద్దాయిలుగా చేర్చాలని నా అభిప్రాయం కాదు’ అని అన్నారు. సీబీఐ విచారణ మొత్తం తప్పులతడకగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

సీబీఐ తీరును చాలెంజ్ చేస్తాం

తన 34 ఏళ్ల పబ్లిక్ సర్వీస్‌లో ఇంతటి తప్పిదమైన కేసును ఎక్కడా చూడలేదని సోమయాజులు అన్నారు. సీబీఐ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందని, దాని తీరుపై కచ్చితంగా న్యాయస్థానాల్లో చాలెంజ్ చేస్తామని స్పష్టంచేశారు. ‘ఈ రోజు ఒక చార్జిషీటు తర్వాత ఒకటన్నట్టు నాలుగైదు చార్జిషీట్లు వేస్తామని సీబీఐ కోర్టులో చెప్పడమంటే విచారణ ఇంకా పూర్తి కాలేదన్నట్లే కదా! ఈ ప్రభుత్వాలు మొరార్జీ దేశాయ్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ వంటి ప్రముఖులను నెలల తరబడి జైల్లో పెట్టాయి. ఆఖరికి ఏ తప్పూ చేయలేదని కోర్టులు తేల్చాయి. ప్రజాస్వామ్యంలో న్యాయం ఈ రోజు కాకపోయినా రేపయినా బయటపడుతుంది’ అని చెప్పారు. జగన్‌ను అరెస్టు చేస్తారా అని ప్రశ్నిం చగా ‘ఏమో నేనెలా చెబుతాను...సీబీఐ వాళ్లు మీకేమైనా సమాచారమిచ్చి ఉంటే చెప్పండి... మీరు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారని, మిమ్మల్ని కూడా వాళ్లు(సీబీఐ) అరెస్టు చేయవచ్చు’ అని సోమయాజులు సమాధానం ఇచ్చారు. 

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More