శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జలుమూరుల్లో జరిగిన సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం సబ్‌స్టేషన్ వద్ద పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు రామకృష్ణాపురం విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నాలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, కర్నూలు జిల్లాలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఆందోళనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలోని సాగర్ రోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కిరోసిన్ లాంతర్లతో ర్యాలీ తీశాయి. కరీంనగర్ జిల్లాలో వేములవాడ, చొప్పదండి, ధర్మపురి, మంథని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
0 comments:
Post a Comment