‘ఏమన్నా.. వేట బాగా సాగుతోందా? చేపలు బాగా పడుతున్నాయా?’

 ‘ఏమన్నా.. వేట బాగా సాగుతోందా? చేపలు బాగా పడుతున్నాయా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకారులను ఆప్యాయంగా పలకరించడంతో వారు పులకించిపోయారు. వేట బాగానే జరుగుతోం దని, తుపానులు, వరదలు వచ్చినప్పుడే ఇబ్బంది పడుతున్నామంటూ మత్స్యకారులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి.. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 వరకు మొగల్తూరు సబ్ స్టేషన్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. తర్వాత ఆయన లైనుపల్లవపాలెం, ఏటిపొర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అక్కడ మత్స్యకారులతో ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ గ్రామాల్లో పాఠశాలలు ఎలా ఉన్నాయి, టీచర్లు వస్తున్నారా? అని అడిగిన జగన్.. పిల్లలను బాగా చదివించాలని, అప్పుడే పేదల బతుకులు బాగుపడతాయని సూచించారు. రాత్రి 8.30 గంటలకు ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సెంటర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరికి చెందిన పలువురు కీలక నేతలు మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీకి చెందిన పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావు(చినబాబు), భీమవరం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పీవీఎల్ నరసింహరాజు, పేరుపాలేనికి చెందిన ఓసూరి విజ్జిబాబు తదితరులు తమ అనుచరులతో పార్టీలో చేరారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More