త్వరలో జరుగబోవు ఉప ఎన్నికలలో మీరు ఇచ్చే తీర్పు ఢిల్లీ నుంచి రిమోట్‌తో ఇక్కడి ప్రభుత్వాన్ని నడుపుతున్న నేతలకు కనువిప్పు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈరోజు ఆయన పసలదీవి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముదునూరి ప్రసాదరాజు రైతుల కోసం పదవిని వదులుకున్నారని చెప్పారు. కాంగ్రెస్,టిడిపిలు కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఓడించాలనుకుంటున్నాయన్నారు.





0 comments:
Post a Comment