నేడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ప్రముఖుల చేరిక

మాజీ శాసన సభ్యుడు కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు (చినబాబు) మంగళవారం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటి పరిశీలకుడు వెలగల సాయిబాబారెడ్డి తెలిపారు. చినబాబు కుటుంబం నుంచి మూడు తరాల నాయకులు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. చినబాబు తాత జవ్వాది లక్ష్మయ్య నాయుడు రెండు పర్యాయాలు, తండ్రి జవ్వాది శ్రీరంగనాయకులు ఒక పర్యా యం పెనుగొండ నియోజకవర్గ శాసన సభ్యునిగా పనిచేశారు. 1999లో ప్రస్తు త సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పితాని సత్యనారాయణపై స్వతంత్య్ర అభ్యర్థిగా చినబాబు పోటీచేసి గెలుపొందారు.

అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరనున్నారు. చినబాబు చేరికతో ఆ చంట, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పార్టీకి అదనపు బలం చేకూరుతుందని కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, కేంద్ర నిర్వాహక కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మె ల్యే మోచర్ల జోహార్‌వతి, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, స్టీరింగ్ కమిటీ సభ్యులు వగ్వాల అచ్యుతరామారావు, నడపన సత్యనారాయణ, ముచ్చెర్ల శ్రీరామ్, వెలగన శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి పెనుగొండలో ఆయనతో చర్చలు జరిపారు. 

నేడు పీవీఎల్ చేరిక..
ఉండి, న్యూస్‌లైన్: ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ లో చేరనున్నారు. పెద అమిరం నుంచి 50 కార్లతో ర్యాలీగా నర్సాపురం వెళ్లనున్నారు. ఆయన 18 ఏళ్లు యండగండి రూరల్ బ్యాంక్ అధ్యక్షునిగా, 9 ఏళ్లపాటు డీసీసీబీ డెరైక్టర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన ఉండి ఏఎంసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున ఉండి అభ్యర్థిగా పోటీచేసిన ఆయన మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పీవీఎల్ తండ్రి తిమ్మరాజు 18 ఏళ్లు ఆకివీడు సమితి అధ్యక్షుని పనిచేసి డెల్టా ప్రాంతంలో రాజకీయ ఉద్దండునిగా ఖ్యాతి గడించారు. పీవీఎల్ రాకతో పీఆర్పీ శ్రేణులు ఆయనతో పయనించేందుకు సన్నద్ధమవుతున్నాయి. రెండు రోజులు గా నియోజకవర్గ స్థాయిలో తన అనుయాయులతో చర్చించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్ సీపీలో చేరిన రాజేష్ పుత్ర
ఏలూరు: తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ బెజ్జం రాజేష్ పుత్ర సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చే రారు. నర్సాపురం రోడ్‌షోలో జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన ఆయన ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, మీడియా కో-ఆర్డినేటర్ బీవీ రమణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More