వైఎస్ఆర్ సీపీలో చేరనున్న తోట గోపి

నర్సాపురం : వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పశ్చిమ గోదావరి పర్యటన ఆ జిల్లా రాజకీయ చిత్ర పటాన్నే మార్చేస్తుంది. జిల్లాలో కీలక కాపు నేతలు వైఎస్‌ జగన్ వెంట నడవటానికి సిద్ధమయ్యారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కీలకపాత్ర పోషించిన తోట గోపీ ...జగన్‌ వెంట నడవటానికి సిద్ధమయ్యారు. 

రాష్ట్రంలో జగన్‌ ప్రభంజనం ఉందని తోట గోపీ అన్నారు. ఈనెల 4న జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి నర్సాపురం వచ్చినట్లు తోట గోపీ చెప్పారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More