సిబిఐ ఛార్జిషీట్ ని తెలుగుదేశం నేత తలసాని శ్రీనివాస యాదవ్ తప్పుపట్టారు. ఛార్జిషీట్‌లో కొన్ని కంపెనీల పేర్లు కావాలనే తొలగించారన్నారు. ఈ ఛార్జిషీట్ రూపొందించండం వెనక కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఆరుగురు మంత్రులు సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్నారు.ఆ మంత్రుల పేర్లు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు లేవని తలసాని ప్రశ్నించారు. వాన్‌పిక్‌కు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. ఆ సంస్థ పేరు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని ఆయన అడిగారు.
కొన్ని పేర్లు ఛార్జిషీట్‌లో లేకపోవడంపై హైకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. మంత్రులు సిఫార్సు చేశాకే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. గత సీఎం నిర్ణయాలకు కేబినెట్ మొత్తానిదీ బాధ్యత అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కేవీపీ కీలక పాత్ర పోషించారని, ఆయన పేరుని ఛార్జిషీట్‌లో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు.

0 comments:
Post a Comment