చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలు, నిజాయితీని బయటకు తీసుకురావడానికి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జెండా స్తంభం సెంటర్ లో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఉపఎన్నికల్లో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజును మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని ఆయన కోరారు. పేదలు, రైతుల జీవితాలు బాగుపడటానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఆ తరువాత రామన్నపాలెం రోడ్డుషోలో మహిళలు, యువకులు జగన్ వెంట నడిచారు. జనం అధిక సంఖ్యలో ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.
నీతిమాలిన రాజకీయ వ్యవస్థలో విలువలను బతికించడానికి ప్రసాద్ రాజు అవిశ్వాసానికి మద్దతిచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీతో ఢీకొవడం కష్టమని తెలిసి కూడా ప్రసాద్ రాజు ధైర్యం చేసి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు . ఉప ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బుల మూటలు కుమ్మరిస్తుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
పోలీసులు అధికార పార్టీకి అండగా ఉంటారని, అయినా ప్రసాద్ రాజు పేదల పక్షాన నిలబడటం రాజకీయాల్లోని కుళ్లును కడిగేయడానికేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని సోమవారం జగన్ ఆవిష్కరించారు. మండే ఎండలోనూ జనం ఆత్మీయనేత కోసం ఎదురు చూశారు. రెండు గంటలు ఆలస్యంగా జగన్ యాత్ర సాగుతున్నా జనం ఏమాత్రం తిరిగి వెళ్లడంలేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని జగన్ అన్నారు.

0 comments:
Post a Comment