17 నుంచి ఓదార్పు పునఃప్రారంభం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర ఈ నెల 17న గుంటూరు నగరంలో తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. ఉపఎన్నిక నియోజకవర్గమైన ప్రత్తిపాడులో ఓదార్పు యాత్ర కొంత ఆలస్యంగా జరగటంతో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో షెడ్యూలు కొంత కుదించటం జరిగిందనీ, దీంతో అన్ని ప్రాంతాల్లో పర్యటించలేకపోయారని వివరించారు. 

పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడి ఈ నెల 17 నుంచి తిరిగి గుంటూరు నుంచి ఓదార్పుయాత్ర జరిగేలా షెడ్యూలు సిద్ధం చేశామని వివరించారు. గుంటూరు నగరంలోని సంగడిగుంట, నల్లచెరువు, రామిరెడ్డితోట, ఆర్టీసీ కాలనీ, పాతగుంటూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐదు వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో రోడ్‌షో జరుగుతుందని వివరించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More