మా పత్రిక ఫార్స్‌ కాదు: జగన్

మా పత్రిక ఫార్స్‌ కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 14 లక్షలకు పైగా సర్క్యులేషన్ సాక్షి సొంతమని జగన్ తెలిపారు. సాక్షి దినపత్రిక దేశంలోనే 8వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. అలాంటి పత్రికలోకి పెట్టుబడులు ఎందుకు పెట్టరని జగన్‌ ప్రశ్నించారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నది ఇన్వెస్టర్‌ ఇష్టమని ఆయన తెలిపారు. టైమ్స్‌ నౌ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ.. తమిళనాడు, గుజరాత్‌ల్లో పరిశ్రమలకు ఉచితంగా భూములిచ్చిన సంగతిని తెలిపారు. అంతేకాదు.. అనేక ప్రోత్సహకాలు కూడా ఇచ్చిన విషయాన్ని జగన్ ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటిని సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోదని జగన్‌ అన్నారు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ పరిశ్రమ ముందుకు రాదన్నారు. ప్రోత్సహకాలు ఇవ్వకుంటే దేశంలోని ఏ రాష్ట్రాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు కాదన్నారు.

సీఎం కిరణ్‌ ఎకరా లక్షరూపాయలకే కేటాయించిన విషయాన్ని ఉదహరణగా చూపించారు. ఇలా ప్రిజమ్‌ సిమెంట్‌కు వేయి ఎకరాలు ఇచ్చారని, తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు లేరు కాబట్టి బలిపశువు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని, పరిశ్రమలకు భూములు ఇవ్వడం రొటీన్ మేటరన్నారు. కాకపోతే రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని జగన్ విమర్మించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాలు పైన దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. భూములిచ్చింది హైదరాబాద్‌ నడిబొడ్డునకాదని, బాగా వెనుకబడ్డ మెదక్, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అని ఆయన తెలిపారు. అయితే చంద్రబాబు హయాంలో జరిగిన కేటాయింపుల మాటేమిటి జగన్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున చవకగా వందల ఎకరాలు ఇచ్చారని, ఎకరా రూ.4కోట్ల విలువైన భూమిని రూ.23లక్షలకే ఇచ్చారని, ఇలా ఎమ్మార్‌కు వందల ఎకరాలు కట్టబెట్టారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రహేజా, ఎల్‌ అండ్‌ టీలకూ ఇదే రీతిలో భూములు కేటాయించారని జగన్‌ అన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More