చంద్రబాబుపై మండిపడ్డ జూపూడి

సీబీఐ సమర్థవంతంగా పనిచేస్తుందన్న చంద్రబాబు ఇప్పుడు మాటెందుకు మార్చారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు. చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. 

1994 నుంచి 2012 వరకు జరిగిన భూ కేటాయింపులపై సభాసంఘం కోరే దమ్ము చంద్రబాబు కుందా అని జూపూడి సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో భూకేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరే సత్తా బాబుకుందా అన్న ఆయన..జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విప్లవాలు పుడతాయని ఘాటుగా హెచ్చరించారు.

మహానేత వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఒంగోలు కొత్తపట్నంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డిపాలెం, మడనూరు గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

వైఎస్‌ఆర్‌ హయాంలో కరెంట్‌ ఛార్జీలు పెంచకపోగా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారని బాలినేని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More