వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి ఏడో తేదీ వరకు మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలి రోజైన గురువారం ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం రామచంద్రపురంలో కొవ్వూరి త్రినాథరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి పసలపూడి చేరుకుంటారు. పసలపూడిలో పార్టీ నాయకుడు తాడి విజయభాస్కరరెడ్డి ఇంటిలో అల్పాహారం తీసుకుంటారు. అక్కడి నుంచి యండగండి చేరుకుంటారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తారు. యండగండి నుంచి ప్రచారం ప్రారంభిస్తారు.
* పామర్రు సెంటర్, అముజూరు
* పాణంగిపల్లి, సత్యవాడ
* తామరపల్లి, కె. గంగవరం
* వెంకటాయపాలెం, ద్రాక్షారామ
* చినతాళ్లపొలం, పెద తాళ్లపొలం
* వెల్ల వంతెన
* రామచంద్రాపురం రాజగోపాల్ సెంటర్, మార్కెట్ సెంటర్‌లో రోడ్ షో ముగుస్తుంది. ఆయన తిరిగి కె.గంగవరం చేరుకుంటారు.
అక్కడ మాజీ ఎంపీపీ వి. రాజశేఖర్ ఇంట్లో రాత్రి బస చేస్తారు. ఈ పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఉంటారని ఆ ప్రకటనలో వారు తెలియజేశారు.

0 comments:
Post a Comment