రేపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొగల్తూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం మొగల్తూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడిలో పాల్గొననున్నారు. నరసాపురం నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొనేందుకు వస్తున్న జగన్ ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆదివారం తెలిపారు. మరోవైపు జగన్.. గుంటూరులో ఓదార్పు యాత్రకు విరామమిచ్చి ఆదివారం రాత్రి 11గంటలకు రోడ్డు మార్గాన నరసాపురానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సోమవారం నుంచి బుధవారం వరకు నరసాపురం నియోజకవర్గంలో జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సోమవారం నుంచి మొగల్తూరు, నరసాపురం మండలాల్లో పర్యటిస్తారు. బుధవారం నరసాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More