మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తాను ఉద్యోగం పొంది ఉండేవాడినని పుట్టుకతో అంథుడైన శ్రీనివాస రావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జెండా స్తంభం సెంటర్ లో వైఎస్ విగ్రహాన్ని యువనేత జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు వేదికపైకి వచ్చి తనకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు జగన్ అంగీకరించడంతో ఆ అంథుడు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఖాళీగా ఉన్న ఉద్యోగాలు పొందే అవకాశం తమకు కల్పించాలని శ్రీనివాసరావు జగన్ కు విజ్ఞప్తి చేశారు. మన జననేత జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.





0 comments:
Post a Comment