వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జగన్ ప్రసాద్ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని రంగాలలో కార్మికులను కలిపి ఒక యూనియన్ ని ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో బలమైన కార్మికశక్తిగా వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ రూపొందుతుందన్నారు. 18 జిల్లాల్లో వైఎస్‌ఆర్ టీయూసీ శాఖలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్మికులందరికీ భద్రత, భరోసా కల్పించడమే వైఎస్‌ఆర్ టీయూసీ ప్రధాన లక్ష్యం అన్నారు. సంఘటిత రంగంలో 85 వేల మంది,అసంఘటిత రంగంలో రెండు లక్షల 50వేల మంది ఇప్పటికే సభ్యులుగా చేరారని వివరించారు.
ఆర్టీసి, సింగరేణి, విశాఖ స్టీల్ ప్లాంట్స్ వంటి వాటిలో యూనియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆర్టీసిలో పది వేల మంది కార్మికులు తమ కార్మిక విభాగంలో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. పలు కార్మిక సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

0 comments:
Post a Comment