సీబీఐపై అపుడో మాట, ఇపుడో మాటా?

సీబీఐ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కొక్కపుడు ఒక్కో మాట మాట్లాడుతున్నారని, నిన్నటి వరకూ ప్రత్యేకత గలిగిన సంస్థ అని పొగిడిన ఆయన ఇపుడు దానిని ప్రభావితం చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘కేసుల నుంచి వైఎస్ జగన్‌ను తప్పిస్తారా’ అంటూ బాబు ప్రశ్నించడం చూస్తే తాము తొలి నుంచీ సీబీఐపై వ్యక్తం చేసిన అనుమానాలు నిజమని తేలుతున్నాయని అన్నారు. ‘జగన్‌ను కేసులో పెడితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే సీబీఐ ఆయన పేరును తప్పించబోతోందని బాబు చెప్పడం చూస్తే.. జగన్ లేకుంటే కాంగ్రెస్ బతకదని ఆయన కూడా భావిస్తున్నట్లుగా ఉంది. 

బాబు అలా అనుకుంటున్నందుకు మాకూ సంతోషంగా ఉంది. అంతే కాదు, జగన్ బయటకుపోవడం వల్ల తమ పార్టీకి కూడా నష్టం జరిగిందని కాంగ్రెస్ వారు కూడా గ్రహించారనేది అర్థం అవుతోంది’ అని వ్యాఖ్యానించారు. జగన్‌ను అరెస్టు చేయాలనీ, ఆయన్ను కేసులో ఇరికించాలనీ బాబు, కాంగ్రెస్ ఎంత కుట్ర పన్నుతున్నారనేది ఆయన మాటల్లోనే అర్థం అవుతోందని ఆయన విమర్శించారు. ‘అసలు జగన్‌ను ఎందుకు అరెస్టు చేయాలి? ఏం నేరం చేశారని అరెస్టు చేయాలి? ఆయన ఏనాడైనా అధికారంలో ఉన్నారా?’’ అని ప్రశ్నించారు. జగన్‌పై చెయ్యేసి చూడండి, రాష్ట్రంలో విప్లవం పుట్టుకొస్తుందని జూపూడి హెచ్చరించారు.

కాగ్‌ను మీరెంత చులకనగా మాట్లాడారో గుర్తులేదా?

రాష్ట్రంలో భూకేటాయింపులపై ‘కాగ్’ చెప్పినా నమ్మరా? అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, గతంలో కాగ్‌ను ఎంత చులకనగా మాట్లాడారో బాబు మరిచారా? అని జూపూడి ప్రశ్నించారు. రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒక్కరి హయాంలోనే భూకేటాయింపులు జరిగాయా? అని జూపూడి ప్రశ్నించారు. సరళీకృత, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కూడా భూమి కేటాయింపులు జరిగాయని, వైఎస్ చేసిన కేటాయింపులు గత విధానాలకు భిన్నంగా ఏమైనా జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More