పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదార్పు యాత్రలో భాగంగా గుంటూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో పలువురు నాయకులతో కలిసి సత్యనారాయణ పార్టీలో చేరారు. అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ నాయకుడు గాదిరాజు వెంకటసుబ్బరాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య కుమార్తె శోభ కూడా జగన్‌ను కలిశారు. పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే బాలరాజు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను ఆయనకు పరిచయం చేశారు. బాలరాజు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ పోలవరం పర్యటనలో పలు పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, పర్యటన ఏర్పాట్లు వివరించడానికి జగన్‌ను కలిశానని తెలిపారు





0 comments:
Post a Comment