వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులకు జగన్ పిలుపు
కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు
ప్రజలపై ఒకేసారి రూ.4 వేల కోట్ల భారం వేశారు
పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఒక్క సమస్యపైనా
చర్చించకుండానే అసెంబ్లీని ముగించారు
రాబోయే మినీ ఎన్నికల్లో ప్రజలు వీళ్ల ఫిక్సింగ్ డ్రామాకు తెరదించుతారు
ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితిలో కరెంటు సరఫరా ఉంది. అది చాలదూ అన్నట్టుగా.. ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా రూ. నాలుగు వేల కోట్లు పిండుకునేందుకు ప్రభుత్వం ఒక్కసారిగా ఈ ప్రజల మీద కరెంటు చార్జీల భారం వేసింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దయలేని ప్రభుత్వాన్ని చూసినప్పుడు బాధనిపిస్తోందన్నారు. ఈ సర్కారు తీరును ఎండగట్టేందుకు, ప్రజల నిరసనను వారికి వినిపించేందుకు ఏప్రిల్ 3న అన్ని సబ్‌స్టేషన్లనూ ముట్టడించాలని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘అందరూ తరలి రండి. ధర్నా చేద్దాం.. మన నిరసన తెలుపుదాం.. అప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుస్తుందేమోనని చిన్న ఆశ ఇంకా నాలో బతికే ఉంది కాబట్టే.. ఈ ధర్నా నిర్వహిద్దాం’’ అని అన్నారు. ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకుండానే అసెంబ్లీ సమావేశాలను ముగించిన పాలక, ప్రతిపక్ష నాయకుల మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రజలు త్వరలో రాబోయే మినీ ఎన్నికలతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 82వ రోజు శనివారం జగన్.. గుంటూరు నగరంలో పర్యటించారు. తొమ్మిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. శ్రీనగర్‌లో ఘోరకవి గోవిందరావు, సాకేతపురంలో మిర్యాల సరస్వతి కుటుంబాలను ఓదార్చారు. అమరావతి రోడ్డు సెంటర్లో జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
మినీ ఎలక్షన్లలో అర్థమయ్యేలా చేద్దాం: త్వరలోనే 18 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతాయి. అవి మినీ ఎలక్షన్లు. వాటి ద్వారా రైతన్న పడుతున్న బాధలు, పేదవాడు పడుతున్న కష్టాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులకు అర్థమయ్యేటట్లుగా చేయాలి. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తున్న ఆ ఢిల్లీ పెద్దలకు కూడా అర్థం కావాలి. మన గ్రామాల్లో పేదవాడు ఎలా బతుకుతున్నాడు? రైతన్న ఎలా బతుకుతున్నాడు? అనే సంగతి వాళ్లకు తెలిసిరావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్త కావాలి.. ఒక్కరికి కాదు వందమందికి చెప్పి ఓట్లు వేయించాలి. ఆ ఫలితాలతోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అనే ఆశతో మనం ఈ ప్రయత్నం చేయాలి.

అసెంబ్లీలో చర్చిస్తారని ఎదురుచూశా: నేను గుంటూరులో చాలా రోజులుగా తిరుగుతున్నా. నా కళ్లతో నేను చూశా.. మిరప కాయలు ఏరితే కనీసం రూ.120 కూలైనా గిట్టుతుందన్న ఆశతో మహబూబ్‌నగర్, నల్లగొండ, కర్నూలు జిల్లాల నుంచి పిల్లాజెల్లలను వెంటేసుకొని వచ్చిన అక్కాచెల్లెమ్మలను చూశా. ‘ఎందుకమ్మా.. పాలమూరు నుంచి ఇక్కడికి వచ్చారు.. ఉపాధి హామీ పనులు అక్కడ జరగడం లేదా తల్లీ’’ అని నేను వారిని అడిగా! ‘అన్నా.. ఆ ఉపాధి హామీ పని చేస్తే కూలి డబ్బు చేతికి వచ్చేటప్పటికి రెండు, మూడు నెలలు పడుతోంది. అది కూడా క్యూబిక్ మీటర్ లెక్కన లెక్క కట్టి ఇస్తున్నారు. కనీసం రూ. 40-50 కూడా గిట్టని పరిస్థితుల్లో మేం పని చేస్తున్నామన్నా. ఆ పనులకు పోయేదానికంటే పొట్టచేతపట్టుకొని ఈ జిల్లాకు వస్తే.. రైతులు నష్టాల్లో ఉన్నప్పటికీ కనీసం రూ.120 కూలైనా ఇస్తారనే ఆశతో ఇంత దూరం వచ్చామన్నా’ అని ఆ అక్కాచెల్లెమ్మలు చెప్తున్నప్పుడు బాధనిపించింది. దీనిపై కనీసం అసెంబ్లీలో చర్చ జరుగుతుంది అనుకున్నా. మన ఖర్మ ఏమిటంటే ఆ అక్కాచెల్లెమ్మల గురించి మాట్లాడే నాథుడే కరువయ్యాడు. గిట్టుబాటు ధర రాక రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇటు పాలకపక్షం గానీ, అటు ప్రతిపక్షంగానీ లెక్క చేసే పరిస్థితిలో లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్యను కూడా అడగలేని పరిస్థితిలోకి ప్రతిపక్షం పోయింది.
వాళ్లకు విద్యార్థుల సమస్యలు పట్టలేదు: అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనైనా ఒక్కరంటే ఒక్కరైనా పిల్లల చదువుల మీద గట్టిగా నిలబడతారేమా.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలని ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని నిలదీస్తుందేమోనని ఆశగా ఎదురు చూశా. పరీక్షలు దగ్గర పడ్డాయి. పిల్లలు పరీక్షలు రాయాలంటే కాలేజీ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వాలి. మా ఫీజులు మాకు కడితే తప్ప మీ హాల్‌టికెట్లు మీకు ఇవ్వబోమనే పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలుంటే.. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు రూ.30 వేల పైచిలుకు, డాక్టర్ చదివే పిల్లాడికైతే రూ.55 వేల పై చిలుకు కావాలి. అంత డబ్బు ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా..?

0 comments:
Post a Comment