జిల్లాలోని పోలిరెడ్డిపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చిన జగన్ కు ప్రజలు హృదయపూర్వక ఆహ్వానం పలికారు. గ్రామస్తులు ఊరి పొలిమేరల దాకా వచ్చి తమ ప్రియతమనేతను ఆహ్వానించారు. తన పట్ల, తన కుటుంబం పట్ల ఆ పల్లెవాసులు చూపించిన ప్రేమాభిమానాలకు జగన్ శిరసు వంచి నమస్కరించారు. మార్గమధ్యంలో ఆయన వైఎస్సార్ కాలనీలో మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఎక్కువ సేపు మాట్లాడలేదని మరోలా భావించవద్దంటూ
ప్రజలకు సవియనంగా విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు సాంబశివ నగర్ లో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అభిమానులు, కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రజలకు సవియనంగా విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు సాంబశివ నగర్ లో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అభిమానులు, కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
0 comments:
Post a Comment