వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరిగే 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. వంద మంది చిరంజీవులు వచ్చినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఆదేశిస్తే తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పోటీ చేస్తానని ఆమె చెప్పారు. చంద్రబాబు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో బయటకు తీస్తామని హెచ్చరించారు.
0 comments:
Post a Comment