నెల్లూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. అక్కడ్నుంచి స్థానిక సుజాతమ్మ కాలనీలోని మేకపాటి అతిథి గృహానికి చేరుకుంటారు.
అక్కడ పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. అనంతరం స్థానిక పొదలకూరు రోడ్డులో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ బాలచెన్నయ్య నెలకొల్పిన వైఎస్సార్ ప్రజా వైద్యశాలను ప్రారంభిస్తారు. తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం వేపినాపి, సిద్ధవరంలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. రాపూరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కడపకు బయల్దేరి వెళ్తారు.

0 comments:
Post a Comment