అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: చేనేతలకు ఇచ్చిన మాట కోసం.. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తీవ్ర జ్వరంతో నీరసించిపోయారు. రాత్రి 9 గంటలకు ఆయన్ను డాక్టర్ హరికృష్ణ పరీక్షించారు. జగన్ జ్వరంతోపాటు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు ఆయన ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీనికితోడు నిరాహారదీక్ష కారణంగా ఆహారం తీసుకోకపోవడంతో జగన్ బాగా నీరసించిపోయారు. జ్వరం, దగ్గు, జలుబుకు మాత్రలు వేసుకోవాలని డాక్టర్ హరికృష్ణ సూచించగా జగన్ నిరాకరించారు. శుక్రవారం రాత్రి నుంచీ ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధర్మవరం దీక్ష గురించి మరోసారి ఆలోచించాలని కార్యకర్తలు, నేతలు సూచించగా.. నేతన్నలు, విద్యార్థుల కోసం, తాను చెప్పిన మాట ప్రకారం దీక్ష చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఆ మేరకు ఆదివారం ఉదయం పులివెందుల నుంచి 115 కిలోమీటర్ల మేర ప్రయాణించి ధర్మవరానికి చేరుకున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉన్నప్పటికీ.. దారి పొడవునా బారులు తీరిన జనం ఆపిన చోటల్లా వాహనం దిగి కరచాలనం చేస్తూ.. చిరునవ్వుతోనే వారిని పలకరిస్తూ ధర్మవరానికి చేరుకున్నారు.

0 comments:
Post a Comment