విశాఖ : విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగవరంలో సోమవారం రోడ్ షో నిర్వహించారు. అరట్లకట్ల నుంచి మంగవరం చేరుకున్న జగన్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఘనస్వాగతం పలికారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఊరంతా ఆత్మీయనేతను చూసేందుకు కదిలి వచ్చింది. మంగవరంలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందర్ని ఆప్యాయంగా పలకరిస్తూ సత్యవరం బయల్దేరారు.
|
0 comments:
Post a Comment