కనిగిరి(ప్రకాశం): ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో మంత్రులను తప్పించాలని ప్రభుత్వం భావించడం క్షమించరాని విషయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కనిగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనతో సహా అప్పటి కేబినెట్‌లోని మంత్రులందరిపైనా విచారణ చేపట్టాలన్నారు. జీఓ విడుదలలో అధికారులకు,మంత్రులకు సమానపాత్ర ఉంటుందన్నారు. ఎమ్మార్ కేసులో అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబును వదిలిపెట్టి ఆయన హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారిని నిందితునిగా పేర్కొనడం ఏమిటన్నారు.
0 comments:
Post a Comment