విశాఖపట్నం: దారివెంట వేలాదిగా జనం ఎదురు చూపులు. పిల్లా, పెద్దా తేడా లేకుండా పెద్ద ఎత్తున బారులు. తమ గుండెల్లో కొలువై ఉన్న మహానేత తనయుడిపై మమకారం, అభిమానం వెరసి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుషో జాతరను తలపించింది. అడుగడుగునా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. అటు నగరంలోనూ, ఇటు జిల్లాలోనూ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జనసందోహం పోటెత్తింది. ప్రజాభిమానం తాకిడితో పర్యటన షెడ్యూలులో దాదాపు ఆరు గంటల ఆలస్యం చోటుచేసుకుంది. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో ఆయన జరపతలపెట్టిన రోడ్‌షో ఆదివారం అర్ధరాత్రికి సగం కూడా పూర్తికాలేదు. దీంతో మిగిలిపోయిన ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా జగన్ సోమవారం కూడా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
ఆదివారం రాత్రికి సరిహద్దులోని తూర్పుగోదావరి జిల్లా తునిలో బస చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఆదివారం పర్యటించాల్సి వున్న గ్రామాల్లో సోమవారం రోడ్డుషో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పాయకరావుపేట మీదుగా అరట్లకోట వెళ్లి అక్కడ నుంచి మిగిలిన రోడ్‌షోను కొనసాగిస్తారు. మంగవరం, గోపాలపట్నం, శ్రీరాంపురం, రాజగోపాలపురం మీదుగా పాల్తేరు వరకు యాత్ర కొనసాగుతుంది. యాత్ర ముగిసిన వెంటనే సోమవారం రాత్రి జగన్ రైలులో గుంటూరు జిల్లాకు బయలుదేరతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కొణతాల రామకృష్ణ తెలిపారు. | |
0 comments:
Post a Comment