విశాఖ : విశాఖ జిల్లాలో రెండో రోజు పర్యటన కోసం వైఎస్ జగన్ సోమవారం ఉదయం 'తుని' నుంచి బయల్దేరారు. తునిలో 'తాడిశెట్టి రాజా" అతిథిగృహంలో ఆయన బస చేశారు. తుని నుంచి జగన్ అరట్లకోటకు ప్రయాణమయ్యారు. ఆత్మీయనేతకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అరట్లకోటలో రోడ్ షోలో జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి మంగవరం చేరుకుంటారు. అటునుంటి సత్యవరం చేరుకుంటారు. సత్యవరంలో ఏకదాసు ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
0 comments:
Post a Comment