హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. దీని వెనక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందనిపిస్తోందన్నారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బాలినేని వ్యాఖ్యానించారు.
ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతోనే తమ అనర్హత విషయాన్ని పెండింగ్ లో పెట్టారని బాలినేని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన బాటలో స్పీకర్ పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు.
|
0 comments:
Post a Comment