హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు లేఖ రాశారు. తమకు ప్రత్యేకంగా ఛాంబర్ కేటాయించాలని ఆమె తన లేఖలో విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై పోరాటానికి దివంగత నేత వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ విజయమ్మ నాయకత్వంలో వీరంతా వైఎస్ఆర్ సీఎల్పీని ఏర్పాటు చేసుకున్నారు.
0 comments:
Post a Comment