జగన్, విజయమ్మలపై పిల్ కొట్టివేత

హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో పొందుపరచలేదని.. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు సోమవారం కొట్టివేసింది. వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వై.ఎస్.విజయమ్మలు కూడా ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో పొందుపరచలేదని.. ఈ నేపథ్యంలో వారిని లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా గుర్తించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పి.సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More