రామోజీ కబ్జా భూములను స్వాధీనం చేసుకోండి

ఆర్డీవో, తహశీల్దార్‌లకు ఆదేశాలు జారీ

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్‌లో రామోజీరావు కబ్జా చేసిన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా ఈస్ట్ డివిజన్ ఆర్డీవో, హయత్‌నగర్ తహశీల్దార్‌లకు ఆదేశాలు అందాయి. తన పరిధిలో ఉన్నవి మిగులు భూములు కావని పేర్కొంటూ జాయింట్ కలెక్టర్ కోర్టులో రామోజీరావు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివరాల ప్రతిని జతచేస్తూ రామోజీ కబ్జాలోని భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు పిటిషన్‌ను కొట్టేసిన విషయానికి సంబంధించిన వివరాలు రామోజీరావుకు కూడా అందినట్టు తెలిసింది. ఆయన తరపు న్యాయవాదులు సోమవారం ఆ ప్రతులను తీసుకున్నట్టు సమాచారం

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More