సోనియా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారంటే దానికి కారణం వైఎస్సారే


అదే మహానేతను అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీ గద్దె మీద కూర్చొని రాష్ట్రంలోనైనా.. కేంద్రంలోనైనా చక్రం తిప్పుతూ ఉన్నారంటే దానికి కారణమైన వ్యక్తి దివంగత నేత వైఎస్సారేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. రెండు సార్లు ఆయన రెక్కల కష్టం మీదనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వైఎస్సార్‌ను అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 68వ రోజు సోమవారం ఆయన వినుకొండ పట్టణంలో పర్యటించారు. చౌడమ్మ గుడి సెంటర్‌లో ఒగ్గు నాగేశ్వర్‌రావు కుటుంబాన్ని ఓదార్చారు. డబ్బాస్తంభం సెంటర్‌లో షేక్ ముస్తఫా కుటుంబాన్ని పరామర్శించారు. పట్ణణంలోని 12 సెంటర్లలో పర్యటించిన ఆయన మూడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. హనుమాన్‌నగర్‌లో ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా నాయకుడు ఉండాలి

వైఎస్సార్‌పై బురదజల్లడం కోసమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నైతిక విలువలన్నీ పక్కనబెట్టి చివరకు చంద్రబాబు నాయుడుతో కూడా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ వీళ్లకు ప్రజలు పట్టడం లేదు.. ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందీ అంటే.. చనిపోయిన దివంగత నేతకు ఒక న్యాయమట! బతికి ఉన్న చంద్రబాబుకు వేరొక న్యాయమట! రాజకీయాలు అంటే రాజకీయం చేయడం కాదు. చనిపోయిన తరువాత కూడా ప్రజల గుండెల్లో బతికే ఉండేలా పేదలకు మేలు చేయాలి. నాయకుడు అనే వాడికి విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఫలానా నాయకుడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్తా గర్వంగా చెప్పుకునేలా ఉండాలి.

పట్టించుకునే నాథుడే లేడు

ఇవాళ ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి చూసినప్పుడు బాధనిపిస్తోంది.. గిట్టుబాటు లేక, దయనీయమైన పరిస్థితుల్లో ఉండీ లక్ష ఎకరాల్లో పంట వేయకుండా సమ్మెకు దిగి.. నా గోడు వినండీ అని రైతన్న ప్రార్థన చేస్తున్నా రాష్ట్రంలో రైతన్నల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతన్న దగ్గరకు వెళ్లి అన్నా.. ఎలా ఉన్నావని పలకరిస్తే.. ‘వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలు’ అనే మాట వినపడుతోంది.

ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో నా రాష్ట్రాన్ని చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. ఇంతటి అన్యాయమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు కాలర్ పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షంలోని చంద్రబాబు నాయుడు, మన ఖర్మ కొద్దీ అధికార పక్షంతో కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదవాడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే... పేదవాడు అనారోగ్యం పాలై 108 అనే నంబర్‌కు ఫోన్ కొడితే.. 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఏ రెండు మూడు గంటలైనా రావట్లేదు. 104కు ఫోన్ కొడితే.. మా అంబులెన్స్‌లో మందులు లేవు అనే సమాధానాలు వినపడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరి నోటా.. ‘ఆ దివంగత నేత బతికే ఉంటే మా పరిస్థితులు ఈ మాదిరిగా ఉండేవే కావు’ అన్న మాటే వినపడుతోంది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More