చంద్రబాబు నాయుడు బ్రతుకు అంతా కుట్రల మయం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఛార్జిలపై పోరాడిన ముగ్గుర్ని కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్, అబద్దాలకు పెద్ద కొడుకు చంద్రబాబు అని.. గోదావరిలో మునిగినా ఆయన పాపాలు పోవని కేసీఆర్ మండిపడ్డారు.
పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయని తె లుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఆస్తులను అమ్మిన చరిత్ర బాబుదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుంభకోణాల్లో విచారణ జరిపించకుండా కోర్టుల్లో స్టే తెచ్చుకున్న ఘనత బాబుదేనన్నారు. పోలవరం టెండర్లపై సీబీఐ విచారణ చేయించాలని.. మా తప్పులేదని తేలితే ముక్కు నేలకు రాస్తారా అని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు.
పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయని తె లుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఆస్తులను అమ్మిన చరిత్ర బాబుదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుంభకోణాల్లో విచారణ జరిపించకుండా కోర్టుల్లో స్టే తెచ్చుకున్న ఘనత బాబుదేనన్నారు. పోలవరం టెండర్లపై సీబీఐ విచారణ చేయించాలని.. మా తప్పులేదని తేలితే ముక్కు నేలకు రాస్తారా అని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు.
రేపటి నుంచి నీ వెంటే పడతా!.. మీ సంగతి చూస్తా!
టీ-టీడీపీ నేతలు చంద్రబాబు మూతి నాకే కుక్కలు
టీ-టీడీపీ నేతలు చంద్రబాబు మూతి నాకే కుక్కలు
కేసీఆర్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దయిన నేపథ్యంలో.. గురువారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాట్లాడటం మాట్లాడటమే చంద్రబాబుపై తిట్ల పురాణం ఎత్తుకున్నారు. "ఇంకా పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తాం.. జాగ్రత్త!'' అంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు. పోలవరం టెండర్ల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు టీడీపీ వారి మీద పరువునష్టం దావా వేస్తామని ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. "టీడీపీ కుక్కలు నిన్నటిదాకా పోలవరం టెండర్లపై సొల్లు కూతలు కూశాయి. కానీ.. టెండర్లు రద్దయ్యాయి. ఇప్పుడు వాళ్లు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? బట్ట కాల్చి మీదేసి.. గోబెల్స్ ప్రచారం చేసి.. కుక్కలకంటే హీనంగా పిచ్చి కూతలు కూస్తే అయిపోతుందా?'' అని కేసీఆర్ విరుచుకుపడ్డారు. "రేపటి నుంచి నీ వెంటే పడతాం. నీ బాగోతాలు.. కుంభకోణాలు.. చరిత్ర మొత్తం బయటపెడతాం. మీ సంగతి చూస్తాం'' అంటూ చంద్రబాబును హెచ్చరించారు.
"చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులకు కారణమయ్యాడు. విద్యుత్ చార్జీల పెంపును నిరసించిన వారిపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టనబెట్టుకున్న నరరూప రాక్షసుడు. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన నీచుడు. తెలంగాణ ఆస్తులు, కంపెనీలను తెగనమ్మిన నయవంచకుడు. నకిలీ స్టాంపుల కుంభకోణం, అర్బన్ బ్యాంకుల కుంభకోణం, స్కాలర్‌షిప్‌ల కుంభకోణం, పనికి ఆహార పథకంలో అక్రమాలు, మద్యం కుంభకోణం, నీరు-మీరు పథకంలో అవినీతి.. ఇలా ఎన్నో కుంభకోణాలు ఆ ప్రబుద్ధుడి హయాంలోనే జరిగాయి.
తెలంగాణలోని రూ.636 కోట్ల విలువైన ఆల్వీన్, నిజాం షుగర్స్ వంటి 20 కంపెనీలను తన అనుయాయులకు రూ.200 కోట్లకే అమ్మి.. కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర ఆయనది. ఎమ్మార్ ఎక్కడిది? ఈ బిల్లీరావు.. ఢిల్లీరావు కౌన్ కిస్కా? గోల్ఫ్ కోర్సును.. రహేజాను తెచ్చింది చంద్రబాబు కాదా? ఎమ్మార్‌లో ఆయన కుటుంబం విల్లాలు పొందలేదా? ఒకటి బాలకృష్ణ భార్యది, మరొకటి చంద్రబాబు కోడలుది.. ఇదీ వారి చరిత్ర'' అని దుయ్యబట్టారు. "రెండు ఎకరాలున్న చంద్రబాబు తల్లి తన మనవడికి రూ.30 లక్షల పెట్టి జూబ్లీహిల్స్‌లో 5 ఎకరాల భూమి కొని ఇస్తుందా? తప్పుడు పత్రాలు.. లెక్కలు చూపి తప్పించుకుంటావా చంద్రబాబు? పొద్దున లేస్తే బినామీ బాగోతం నీది.
వచ్చిన తెలంగాణను ఆపింది నువ్వు కాదా? తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేసింది నువ్వే కదా ? అయినా పెద్దనోరు పెట్టుకొని మాట్లాడితే అయిపోతుందా ?'' అని టీడీపీ చీఫ్‌పై మండిపడ్డారు. "ఏనుగు వెళ్తుంటే పిచ్చి కుక్కలు ఎన్నో మొరుగుతాయని ఇన్ని రోజులు చూసీచూడనట్టు పోయినం. చచ్చిన పామును ఇంకా చంపుడెందుకని ఊరుకుంటుంటే.. చెప్పిందే చెప్పుకొంటూ పోతున్నరు. ఇకపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. నాలుకలు కోసేస్తాం.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి జాగ్రత్త!'' అంటూ టీడీపీ నేతలను కేసీఆర్ హెచ్చరించారు.
"రద్దయిన పోలవరం టెండర్ల ఫైళ్లు స్పీకర్ దగ్గరికి ఎందుకు? ఈ వ్యవహారంపై హైకోర్టు జడ్జితోనే న్యాయవిచారణ జరిపించి, నిజాల నిగ్గు తేల్చాలి. దీనిపై మీ వైఖరి ఏమిటో చెప్పండి'' అంటూ టీడీపీ నేతలను డిమాండ్ చేశారు. "విచారణలో టీఆర్ఎస్‌కు టెండర్లతో సంబంధంలేదని తేలితే.. అబిడ్స్‌లో మీ ముక్కు భూమికి రాస్తారా ? ఆర్ యూ రెడీ ?.. చంద్రబాబు చెంపలేసుకొని క్షమాపణ చెపుతాడా? టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాడా? అయినా ఈ లఫంగి మాటలు ఎందుకు?'' అని 'దేశం' నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
పోలవరాన్ని అంతర్రాష్ట్ర వివాదంగా మార్చింది మేమే
పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు కోరుతూ అందరికంటే ముందుగా తాను సీఎంకు లేఖ రాశానని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇప్పటికీ నడుస్తోందని చెప్పారు. "వైఎస్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును ఆపుతున్నారని మా పార్టీ ఎమ్మెల్యేలను నిందించారు. అప్పుడు కన్నతల్లి దయ్యమైతే పిన్నతల్లి వద్దకూ వెళ్లాం. ప్రాజెక్టు డిజైన్ మార్చాలనే ఉద్దేశంతో.. పోలవరంను అంతర్రాష్ట్ర జల వివాదంగా మార్చటానికి ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకూ సమాచారాన్ని ఇచ్చాం'' అని తెలిపారు.
"పోలవరం ప్రాజెక్టు టెండర్ పొందింది ఎవడో నాకు తెలియదు. అది కమ్మోళ్లు 1950 కంటే ముందు పెట్టుకున్న కంపెనీ. ఎవడో బోడిగానికి టెండర్ వస్తే మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టినట్లు దాంతో నాకు సంబంధం అంటగడతారా?'' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకునే చంద్రబాబు.. బతుకేందని ప్రశ్నించారు. "చంద్రబాబూ.. నీ అక్రమాలపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. వద్దంటూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లావు ? నువ్వో పెద్ద మానిప్యులేటర్‌వి. న్యాయ పరీక్షకు ఒక్కసారైనా నిలబడ్డావా?'' అని నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మించాలో.. వద్దో టీడీపీ నాయకులు ముందు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. "పోలవరం కట్టి.. తెలంగాణను ముంచే వారికి భజన చేస్తారా ? మీ వైఖరి చెప్పండి ?'' అని సవాల్ చేశారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని, ఇందుకోసం రాబోయే రోజుల్లో ఉద్యమం కూడా చేస్తామని కేసీఆర్ చెప్పారు. చంద్రబాబు ఆంధ్రాలో ఉపన్యాసాలు దంచుతూ 'పోలవరం' కడుతామని చెబుతున్నారని, అప్పుడు తమ బతుకేంది అనేది టీడీపీ తెలంగాణ నేతలు తేల్చుకోవాలన్నారు. "పోలవరం టెండర్ల విషయంలో టీఆర్ఎస్, కేసీఆర్‌పై ఆరోపణలు చేసి ఉద్యమాన్ని మలినం చేయాలని చూశారు.
ఈ సన్నాసులు (టీడీపీ తెలంగాణ నేతలు) చంద్రబాబు మూతి నాకే కుక్కలు. సకల జనుల సమ్మె సమయంలో ఏ ఫ్రిజ్‌లో.. ఎక్కడ పండావ్ చంద్రబాబూ ?..సెల్‌ఫోన్లు నువ్వే తెచ్చావా ? సీఎంగా ఉన్నప్పుడు ఇట్లనే మాట్లాడితే.. సింగపూర్ ఆర్థిక మంత్రి అలాంటి వాళ్లను మా దగ్గరైతే పిచ్చాస్పత్రిలో చేర్చుతామని లేకపోతే ఉరి తీస్తామని చెప్పారు. గుర్తు లేదా?'' అని అన్నారు. టీడీపీ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. 'దొంగల ముఠా బండే' అని చెప్పారు. ఆ పార్టీది పైరవీలు, టెండర్ల చరిత్ర అయితే తమది ఉద్యమాల చరిత్ర అని అన్నారు. తమకు టెండర్ అంటే ఏమిటో..అది ఎలా వేస్తారో కూడా తెలియదని చెప్పారు. కార్పొరేట్ పైరవీలు, టెండర్ సెటిల్‌మెంట్లతో బతుకుతున్నది టీడీపీ వాళ్లేనని, తమకు అటువంటి సంబంధాలులేవని అన్నారు.
ఆ అర్హత ఈ సొల్లుగాళ్లకు ఉందా ?
"చంద్రబాబూ చాలెంజ్ చేస్తున్నా.. రాబోయే ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ నీ పార్టీకి డిపాజిట్ రాదు. నిన్ననే సర్వే రిపోర్ట్ వచ్చింది. ఒక్కో స్థానంలో 5వేల నమూనాలతో సర్వే చేయించాను. టీడీపీకి ప్రతి చోటా 10 శాతంలోపే ఓట్లు. 7,8,9 శాతం ఓట్లు వస్తే మహా ఎక్కువ. అప్పుడు నీ బతుకు ఎందో తేలుతుంది కదా?'' అని వ్యాఖ్యానించారు. ఉన్నతమైన ప్రజాకోర్టులోనే తేల్చుకుందాం..రా ! అంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. "తెలంగాణపై నువ్వు కుడి వైపా? ఎడమ వైపా? చెప్పు'' అని నిలదీశారు. చేసిన తప్పులకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని, ఇప్పటికైనా మాజీ సీఎంగా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని కేసీఆర్ కోరారు.
"తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఈ సొల్లుగాళ్లకు ఉందా ? శవాల మీద ప్రమాణాలు చేసిన పారిపోయిన దద్దమ్మలు వాళ్లు. ఎవరో కొంత మంది నకిలీ.. డూప్లికేట్‌గాళ్లను తెచ్చి.. వాళ్లే అమరవీరుల కుటుంబాలంటే నమ్ముతారా? అసలు అమరవీరుల కుటుంబాలు తెలంగాణ ద్రోహుల పార్టీ కార్యాలయానికి వెళ్తాయా?'' అని ప్రశ్నల వర్షం కురిపించారు. "తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది మేం. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల వరకు కూడా ఇచ్చాం. కాని, ఎక్కడా చెప్పలేదు. చెబితే అమర వీరులను అవమానించినట్టే. వారి మరణానికి వెలకట్టినట్టే. ఈ దరిద్రులా.. లోఫర్‌గాళ్లా.. అమరుల కుటుంబాలను ఆదుకునేది?'' అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
0 comments:
Post a Comment