మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబులు నాటకం ఆడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి బాజిరెడ్డి మాట్లాడారు.
సభాసంఘం అంతా భూటకమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ చేతగాని తనంవల్లే రాష్ట్రంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బాజిరెడ్డి అన్నారు.

0 comments:
Post a Comment