హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిపైన, పార్టీ నేతలపైన కొన్ని పత్రికలు కావలసినంత బురద చల్లిన తరువాత ఈరోజు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఖండించడం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. కొన్ని పత్రికలు సిబిఐ కథనాల పేరుతో గతంలో ప్రచురించిన సమయంలో ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ఈరోజు స్పందించడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. సిబిఐకి దురుద్దేశాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారని, ఆయనకు నటులు ఎవరూ సాటిరారన్నారు. ఎల్లో మీడియా అంతా రాసిన తరువాత ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. నార్కో పరీక్షకు లక్ష్మీనారాయణ సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి ఇదే తగిన సమయం అన్నారు. సిబిఐ లీకు వీరులకు పద్మ అవార్డులు ఇవ్వాలని ఆమె వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి
దిగజారిపోయిందన్నారు. ఈ రోజు ప్రజలలో సిబిఐ ఎంత పలచనయిపోయిందో గుర్తించాలని ఆమె అధికారులను కోరారు.

0 comments:
Post a Comment