గోనె ప్రకాశ్‌రావు: ఉపఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీలో రాజకీయ సంక్షోభం తప్పదని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్‌రావు జోస్యం చెప్పారు. ఉపఎన్నికలు జరిగే 24 స్థానాలలో కనీసం 13 చోట్ల టీడీపీకి డిపాజిట్ కూడా
దక్కదని ప్రకటించారు. రోజొకటి మాట్లాడుతూ...పగటి కలలు కనడం మానేయాలని బాబుకు సూచించారు.
చంద్రబాబు తీరు చూస్తుంటే ఆయనకు మతిమరుపు వచ్చిందోమోనని అనుమానం కలుగుతోందని గోనె అన్నారు. సొంత జిల్లాలో నిరాదరణకు గురైన బాబు ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోతాయన్న చంద్రబాబు...మరి తనకు ప్రత్యర్థి ఎవరో చెప్పాలని గోనె డిమాండ్ చేశారు.