ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు: సురేఖ రైతులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న ఆరాటం రైతులపై లేదని ఆమె విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జగన్ చేపట్టిన రైతుదీక్షలో పాల్గొన్న ఆమె గురువారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అకుంఠిత దీక్షతో అన్నదాతల కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రైతులందరూ జగన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. జగన్‌తోనే మళ్లీ వైఎస్సార్ పాలన వస్తుందన్నారు. కాంగ్రెస్ కొమ్ముకాయడానికే చంద్రబాబు అవిశ్వాసం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జగన్ దీక్షను అడ్డుకోవాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునివ్వడాన్ని సురేఖ తప్పుబట్టారు. చంద్రబాబు పర్యటించినప్పుడు అడ్డుకోవాలని ఎందుకు పిలుపివ్వలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టే కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమవుతోందని అన్నారు. రైతుదీక్షను విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ను సీఎం చేసేందుకు కృషి తన ఆరోగ్యం సహకరిస్తే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సంతోష్‌రెడ్డి అన్నారు. తన ఆశీస్సులు జగన్‌కు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జగన్ చేపట్టిన రైతుదీక్షలో పాల్గొన్న ఆయన గురువారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. వైఎస్సార్‌ను అపర భగీరథుడిగా సంతోష్‌రెడ్డి వర్ణించారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. జగన్ చేపట్టిన రైతుదీక్షకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. రైతుదీక్షను విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. Bajireddy speech at Ending day of Jagan's armuru Rythu Deeksha MP Mekapati speech at Ending day of Jagan's armuru Rythu Deeksha