హైదరాబాద్ : హైదరాబాద్ : జూనియర్ల డాక్టర్లు చేస్తున్న డిమాండ్లన్నీ సమంజసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జూడాల అన్నీ డిమాండ్లు మానవత్వమైనవేనన్నారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో సమ్మె చేసున్న జూనియర్ డాక్టర్లను పరామర్శించిన జగన్ వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
జూడాల దీక్ష ఏడోరోజుకు చేరుకున్నా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం దారుణన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజే మూడో పాయింట్ మినహా జూనియర్ డాక్టర్ల అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆమరణదీక్షతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జూడాలకు ఈ సందర్భంగా జగన్ విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతున్న జూనియర్ డాక్టర్లను ఆయన పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించిన రవి అనే జూనియర్ డాక్టర్‌కు వైఎస్ జగన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

0 comments:
Post a Comment