అబద్ధపు రాతలతో చేయాల్సిన నష్టమంతా చేసేసి అమాయకత్వ ప్రదర్శనా?

లీకుల ఆధారంగా కథనాలు.. కథనాల ఆధారంగా చర్యలు.. సీబీఐ దర్యాప్తు తీరిదీ అక్రమ లీకులు, అబద్ధపు రాతలతో చేయాల్సిన నష్టమంతా చేసేసి అమాయకత్వ ప్రదర్శనా? ఆరు నెలలుగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు సీబీఐ కంట పడలేదా? హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయటమే లక్ష్యంగా.. ఆది నుంచి ఎల్లో మీడియాకు ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ వస్తున్న సీబీఐ ఇప్పుడు ఎక్కడా లేని అమాయకత్వం ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వక లీకులతో చేయాల్సిందంతా చేసి.. కలిగించాల్సిన నష్టం కలిగించి.. చల్లాల్సిన బురదంతా చల్లి.. తమకేమీ తెలియదంటూ నాటకాలాడుతోంది. తాము వెల్లడిస్తున్నట్లుగా మీడియాలో ఓ వర్గం ప్రచురిస్తున్న వార్తలు, టీవీల్లో ప్రసారమవుతున్న కథనాలకు తమకు సంబంధం లేదని బొంకుతోంది. వ్యక్తుల పరువు ప్రతిష్టలను మంటగలిపే విధంగా, వ్యాపారాలను దెబ్బతీసే విధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇంత కాలం తప్పుడు కథనాలు ప్రచురించినా కిమ్మనని సీబీఐ ఇప్పుడు హఠాత్తుగా మేలుకున్నట్లు.. ఆ కథనాలకు తమకు సంబంధం లేదని ఆ సంస్థ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ అమాయకంగా చేసిన ప్రకటన చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మార్ కేసులో కీలక అరెస్టులన్నీ జరిగిన తరువాత.. సీబీఐ ఇటువంటి 'అమాయక' ప్రకటన చేయటం పక్కా వ్యూహంలో భాగమేనని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు తీరును మొదటి నుంచీ పరిశీలిస్తున్న న్యాయనిపుణులు... 'కేసు విచారణలకు సంబంధించిన అంశాలతో పాటు ఎక్కడో ఎవరికీ తెలియని న్యాయస్థానాల్లో 161 సెక్షన్ కింద నమోదు చేసిన వాంగ్మూలాల వివరాలు ఎల్లో మీడియాకు ఎప్పటికప్పుడు ఎలా అందాయి? సాక్షులు చెప్పిన ప్రతి అంశాలను యథాతథంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలా ప్రచురించగలిగాయి? అంతెందుకు రెండు రోజుల కిందట ఓఎంసీ కేసుకు సంబంధించిన 161 వాంగ్మూలాలు ఆ రెండు పత్రికలకే ఒకే రోజు ఎలా చేరాయి? నిందితులకు కూడా వివరాలు అందకముందే ఆగమేఘాల మీద ఆ రెండు పత్రికల యాజమాన్యాలకు అతి రహస్యంగా ఎలా అందాయి? ఆ రెండు పత్రికలూ ఒకే రోజు ఎలా ప్రచురించాయి? ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలు నిజం అన్న తరహాలోనే సీబీఐ ఇంతకాలం వ్యవహరించిన శైలిని ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? ఎల్లో మీడియా దర్శకత్వంలో సీబీఐ పనిచేస్తోందనటానికి ఇంతకన్నా తిరుగులేని సాక్ష్యాలు ఏం కావాలి? సికింద్రాబాద్ రైల్వే కోర్టుల్లో ఎవరికీ తెలియకుండా కొండారెడ్డి అనే వ్యక్తి వాంగ్మూలం ఇస్తే మరుసటి రోజు ఆ వాంగ్మూలాన్ని యథాతథంగా ప్రత్యక్షంగా విని రాసినట్లు ఆంధ్రజ్యోతిలో రావటాన్ని ఎలా భావించాలి?' అని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ స్వయంగా వెల్లడిస్తే తప్ప ఈ వివరాలన్నీ ఆయా పత్రికలకు తెలిసే అవకాశం లేదని చెప్తున్నారు. ఒక్కో చోట ఒక్కో తీరా? జాతీయ సంస్థ అయిన సీబీఐ విచారణ సరళి అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకించి జగన్ వ్యవహారంలో దీనికి భిన్నంగా దర్యాప్తు, లీకులు ఎందుకు సాగుతున్నాయో సీబీఐనే చెప్పాలి. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన బన్వరీ కేసులో ఊహాజనితమైన మీడియా వార్తలను సీబీఐ ఏ రోజుకా రోజు ఖండిస్తూ వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలపై ప్రతి రోజూ మీడియా వార్తలను ఖండిస్తూ సీబీఐ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఇక్కడ మాత్రం జగన్‌కు సంబంధం లేని ఎన్నో ఆరోపణలను సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం అంటూ ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేసినా సీబీఐ నోరు మెదపలేదు. తప్పుడు వార్తలతో తమను అప్రదిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని, సీబీఐ దర్యాప్తులో తేలని విషయాలను తేలినట్లు పత్రికలు రాస్తున్నా ఖండించకపోవటం అన్యాయమని విజయసాయిరెడ్డి లాంటి వారు నెత్తీనోరు మొత్తుకున్నా స్పందించకపోవటం వెనుక మతలబు జగన్‌ను దెబ్బతీయటమేనని రాష్ట్ర ప్రజలందరికీ అవగతమైంది. జగన్ ఇంట్లో సోదాల సందర్భంగా ఇంట్లోనే విలాసవంతమైన విదేశీ బారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయంటూ పచ్చమీడియా ప్రసారం చేసినా సీబీఐ ఎందుకు నోరు మెదపలేదు? లేని వాటిని ఉన్నట్లు పేర్కొన్నా ఎందుకు ఖండించలేదు? ఇలా గత ఐదారు నెలలుగా సీబీఐని అడ్డంపెట్టుకుని వైఎస్ కుటుంబంపై బురదజల్లటమే లక్ష్యంగా ఒక వర్గం మీడియా పరస్పర సంబంధంలేని కథనాలు ప్రచురిస్తున్నా ఏనాడూ ఖండించని సీబీఐ ఈ కేసు ముగింపు దశకు వచ్చినప్పుడు హఠాత్తుగా ఖండించటం వెనుక అసలు వ్యూహం ఏమిటి? నా సాక్ష్యాన్ని ఆ పత్రికలో యథాతథంగా రాశారు... సీబీఐ లీక్‌ల విషయంలో పారిశ్రామికవేత్త రఘు రామకృష్ణ రాజు హైకోర్టుకు ఈ విధంగా నివేదించారు... 'ఎమ్మార్ టౌన్‌హిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్) అభివృద్ధి చేసిన బౌల్డర్ హిల్స్‌లో విల్లా కొనుగోలు చేసిన పలువురు వ్యక్తులతో పాటు సీబీఐ నన్ను కూడా విచారించింది. దాదాపు 40 మంది సాక్షులను స్వయంగా పిలిపించి పలుమార్లు విచారణ చేసింది. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ చెల్లించినట్లు ఒప్పుకోవాలని సీబీఐ ఒత్తిడి తెచ్చింది. విచారణలో భాగంగా సీబీఐ 24.11.2011న రెండోసారి సాక్షిగా విచారించింది. అదే నెల 26న ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'సీబీఐ వలలో కేవీపీ బంధువు' అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. నన్ను సహ నిందితునిగా చేయనున్నారని ఆ పత్రిక రాసింది. అంతేకాక సీబీఐ అడిగిన ప్రశ్నలకు మొండిగా సమాధానాలు చెప్పానని కూడా ప్రచురించింది. నాకు వర్తింప చేసినవేవీ కూడా జరగకపోయినా.. జరిగినట్లు రాసింది. నేను సీబీఐ అధికారులు ఇచ్చిన సాక్ష్యాన్ని యథాతథంగా ప్రచురించింది. సాక్ష్యమిచ్చే స్వయంగా ప్రత్యక్షంగా విని రాసినట్లు నా సాక్ష్యాన్ని రాసింది. వాస్తవానికి దర్యాప్తు అధికారి, మరో ఇద్దరు అధికారుల సమక్షంలో మాత్రమే నేను సాక్ష్యం ఇవ్వటం జరిగింది. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం నేను సాక్ష్యం ఇచ్చే సమయంలో మా ముందు కూర్చుని అంతా స్వయంగా విని రాసిన పద్ధతిలో వార్తా కథనం ప్రచురించింది. నన్ను విచారించిన సీబీఐ అధికారులకు ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని లీక్ చేయటం అలవాటుగా మారింది.''

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More