ఇడుపులపాయ : నిజామామాబాద్ జిల్లా ఆర్మూరులో వైఎస్ జగన్ దీక్ష చేస్తున్న నేపధ్యంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఈరోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఆమెతో పాటు వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి ఉన్నారు. ఈనెల 29వతేదీన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లి పత్రికను వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణాలతారెడ్డి వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచి నివాళులు అర్పించారు.
|