ఆర్మూర్ : వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షకు మహిళలు పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఆయన దీక్షకు సంఘీభావంగా స్వచ్చందంగా తరలివస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మునిపల్లి నుంచి వేలాది మంది మహిళా రైతులు ఆర్మూర్ వచ్చారు. వైఎస్ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యా లేదనీ..ఇప్పుడు పట్టెడన్నం తినే పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. జగన్ దీక్ష తమకు మనోధైర్యం కలిగించిందని మహిళలు తెలిపారు.