ఆర్మూరు (నిజామాబాద్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు మద్దతుగా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు. రైతులతోపాటు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు దీక్షాశిబిరం వద్దకు చేరుకున్నారు. జగన్ ని దగ్గరగా చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు జనం బారులుతీరారు.దీక్షా ప్రాంగణం జనంతో నిండిపోయింది. రైతులు తమ పొలాలలో ఎండిపోయిన పంటలను తీసుకువచ్చి జగన్ కు చూపించి, తమ బాధలు చెప్పుకుంటున్నారు. వారు చెప్పే బాధలు జగన్ ఓపికగా వింటున్నారు. వారిని పరామర్శించి, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చి పంపుతున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లా గురజాల తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా రైతులు తరలివచ్చి జగన్ రైతుదీక్షకు సంఘీభావం తెలిపారు. జగన్ చేస్తున్న దీక్షతోనైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరారు. దీక్షలో ప్రకటించిన డిమాండ్లపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలకు అన్నం పెడుతోన్న తమగురించి ఇంతగా ఆలోచించే నాయకుడు దొరకడం తమ అదృష్టమని చెబుతున్నారు. మహిళలు కూడా జగన్‌కు సంఘీభావంగా స్వచ్చందంగా తరలివస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా మునిపల్లి నుంచి వేలాది మంది మహిళా రైతులు ఆర్మూర్ వచ్చారు. వైఎస్ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యా లేదని, ఇప్పుడు పట్టెడన్నం తినే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దీక్ష తమకు మనోధైర్యం కలిగించిందని చెప్పారు.
మహానేత చనిపోయాక రాష్ట్రంలోని రైతులకు అలాంటి భరోసా మరోసారి కనిపించిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా తాము పడుతున్న గోసకు జగన్ రూపంలో ఇక ముగింపు దొరికినట్లేనన్నారు.
ఓవైపు దీక్ష కొనసాగిస్తూనే ప్రతిఒక్కరినీ ప్రత్యేకంగా కలిసేందుకు జగన్ ఆసక్తి చూపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, కార్యకర్తలు , అభిమానులు, మహిళలు, విద్యార్థులను ఒక్కొక్కరిగా వేదికపై కలుసుకొని వాళ్ల సమస్యలు ఓపిగ్గా వింటున్నారు. ఈనేపథ్యంలో పలువురు ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు కూడా జగన్‌ను కలిసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి ప్రభుత్వం మీద ఒత్తిడితేవాలని కోరారు.
రెండోరోజు దీక్షలో ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, రామకృష్ణారెడ్డి , మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జర్నలిస్టు నేతలు అమర్, అమర్‌నాథ్ తదితరులు కూడా జగన్‌ను కలిసి రైతు కోసం చేస్తున్న దీక్ష చారిత్రాత్మక మైనదని ప్రశంసించారు.