విజయవాడ : రైతుల సమస్యల పరిష్కారానికి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 48 గంటల లక్ష్య దీక్ష దిగ్విజయం అయ్యింది. చలి వణికిస్తున్నా ఆయనతో పాటు లక్షలాదిమంది ఈ దీక్షలో పాల్గొన్నారు. మూడో రోజు కూడా ఈ దీక్షకు ప్రజలు, రైతులు, అభిమానులు, కార్యకర్తలు వెల్లువలా తరలి వచ్చారు. దాంతో కృష్ణాతీరం జనసంద్రం అయ్యింది.