హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పలకరింపులతో పల్లె, పట్టణ ప్రాంతాల ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. కొత్తపంటలు, సిరిసంపదలతో రైతు కుటుంబాలు కళకళలాడాలన్న ఆకాంక్షను ఆయనీ సందర్భంగా వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా ప్రజాసమస్యలపై దృష్టి సారించేలా పాలకులకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని అన్నారు.