కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాలును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ స్వీకరించారు. తన అంగరక్షకులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఎస్పీకి లేఖ రాశారు. ప్రభుత్వం అందజేసిన గన్‌మెన్‌తో తిరుగుతూ సర్కారును విమర్శించడం ఏమిటని గతంలో పొన్నం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గన్‌మెన్‌ను వదిలేసి మాట్లాడాలని ఆది శ్రీనివాస్ కు పొన్నం సవాల్ విసిరారు కూడా.
పొన్నం సవాల్ పై స్పందించిన ఆయన అంగరక్షకులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తనను భౌతికంగా అంతం చేయడానికి పొన్నం కుట్ర పన్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వైఎస్ చలవతో గెలిచిన పొన్నం పదవికి రాజీనామా చేసి సోనియా బొమ్మతో గెలవాలని ప్రతి సవాలు విసిరారు.

1 comments:
jai telangana
jai jagan
Post a Comment