గుంటూరు జిల్లాలో మలివిడత ఓదార్పుయాత్రను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మంగళవారం తిరిగి ప్రారంభించనున్నారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో జగన్ బయలుదేరి రేపు తెల్లవారుజామున సత్తెనపల్లిలో దిగుతారు.
మలివిడత ఓదార్పుయాత్రను పెదకూరపాడు నుంచి జగన్ ప్రారంభిస్తారు. పెదకూరపాడులో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పెదకూరపాడు నుంచి బయలుదేరి రామాపూరం, బుచ్చయ్యపాలెంలో జగన్ పర్యటిస్తారు.
అత్తలూరులో రెండు వైఎస్ విగ్రహాలు ఆవిష్కరించి.. జూపూడి గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత మునుగోడు గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న మహానేత ఐదు విగ్రహాల్ని వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. బయ్యవరం మీదుగా ఉటుకూరు చేరుకుని.. జెర్రిపోతు భద్రమ్మ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక భద్రమ్మ ప్రాణాలు కోల్పోయారు.

0 comments:
Post a Comment