మొగల్తూరు : త్వరలో 18చోట్ల జరగబోయే ఉపఎన్నికల్లో పేదవాడు పడుతున్న బాధలెంటో పాలకులకు అర్థమయ్యేలా తీర్పుఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసనగా మొగల్తూరు సబ్‌స్టేషన్ ముందు చేపట్టిన ధర్నాలో ఆయన కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ... ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కరెంట్ బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోందని జగన్ మండిపడ్డారు. బిల్లులు కట్టని రైతులను అరెస్ట్ చేయాలంటూ జీవోలు కూడా జారీలు చేస్తున్నారని అన్నారు.
అంతకు ముందు వైఎస్ జగన్ ముందు స్థానిక మహిళలు కరెంట్ కోతలతో తాము పడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. భారంగా మారిన చార్జీలు..ఎప్పుడు వస్తుందో తెలియని కరెంట్ వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ధ ధర్నాలో పాల్గొన్నారు. అంతకు ముందు వేలాది అబిమానుల మధ్య ఆయన మొగల్తూరుకు తరలివచ్చారు. అప్పటికే వేలాది మంది సబ్‌స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. దారి పొడవునా జై జగన్ నినాదాలతో పల్లెలు మారుమోగాయి.
విశాఖ : విద్యుత్ ఛార్జీల పెంపుపై విశాఖలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం విప్పింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని గాజువాకలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సమన్వయ కర్త కొణతాల రామకృష్ణ సారథ్యంలో ధర్నా జరిగింది.
అలాగే ఛార్జీల పెంపును నిరసిస్తూ పార్టీ నేత సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు కడపలో విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

తిరుపతి : పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకూ ప్రజల తరఫున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలో స్పష్టం చేశారు. ప్రజల పాలిట ఈ ప్రభుత్వం శాపంగా మారిందని ఆయన విమర్శించారు. స్థానిక సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిపాలనా భవనం ఎదుట నిరసన తెలపడంతో విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగులు లోపలికి వెళ్లలేకపోయారు.
అటు విజయనగరంలోనూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఛార్జీల పెంపుకు కారణమైన సిఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సామాన్యులపై భారం మోపుతున్న కరెంట్ ఛార్జీలను తగ్గించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని పార్టీ నేతలు హెచ్చరించారు. చీపురుపల్లిలోనూ పార్టీ నేత సూరినాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

హైదరాబాద్ : పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగించింది. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు భారీ ధర్నా నిర్వహించింది. పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, జనక్ ప్రసాద్, రాజ్ ఠాకూర్, శివకుమార్, రవీంద్ర నాయక్‌లతోపాటు వందలాది మంది కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నల్గొండ: విద్యుత్ చార్జీలు తగ్గించాలని సూర్యాపేటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యకర్తలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో విద్యుత్ సబ్స్టేషన్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు.
జిల్లావ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో విద్యుత్ సబ్స్టేషన్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు.
కర్నూలు: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వీణవాడ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమా నాగిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా భూమా దంపతులు నాగిరెడ్డి, శోభ మాట్లాడుతూ పేదల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయలేని ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. గతంలో ఆ మహానేత డాక్టర్ వైఎస్ విద్యుత్ ఛార్జీలను ఒక్క పైసా కూడా పెంచని విషయాన్ని వారు గుర్తు చేశారు.
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి ఆధ్వర్యంలో పామూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కనిగిరిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కార్యకర్తలు ముట్టడించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు.
మెదక్: పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట విద్యుత్ డిఇ కార్యాలయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. ధర్నా నిర్వహించి వారి నిరసన తెలిపారు.
రామచంద్రపురంలోని జాతీయరహదారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు కొండా రాఘవరెడ్డి, అంజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రామచంద్రపురంలోని జాతీయరహదారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు కొండా రాఘవరెడ్డి, అంజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతపురం: విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఈరోజు నిరస తెలిపారు. అనంతపురం, ఉరవకొండ, రాప్తాడు విద్యుత్ కార్యాలయాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. అనంతపురంలో పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, ఎరిస్వామిరెడ్డి తోపుదుర్తి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు.
గుంతకల్లులో ఏడీఈ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ విద్యుత్ సబ్‌స్టేషన్ ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడించారు.

రాజమండ్రి: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతటా నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ స్టేషన్లను ముట్టడించారు. ధర్నాలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆదిరెడ్డి అప్పారావు, రాజ్‌కుమార్ ల ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ని ముట్టడించారు. సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. పెద్దాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ అమలాపురం, ముమ్మడివరం విద్యుత్ సబ్స్టేషన్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
ముట్టడించారు.
సామర్లకోట విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తోట సుబ్బారావు నాయుడు, కంటె రాఘవ, సత్యానందం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ ని ముట్టడించారు.
ఏలేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. అమలాపురంలో పార్టీ నేతలు ఆనంద్‌సాగర్, మోహన్ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. జక్కంపేటలో పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ని ముట్టడించారు.

ఏలూరు: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా అంతటా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకులో ఎస్‌ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కోడూరులో ప్రసాదరాజు ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ జీలుగుమిల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బోదా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. చింతలపూడిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

0 comments:
Post a Comment