దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తుది శ్వాస విడిచిన ప్రాంతాన్ని సుందరమైన స్మృతివనంలా తీర్చి దిద్దుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట.. నీటిమాటగానే మిగిలింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన ప్రాంతాన్ని అప్పట్లో నేతలంతా సందర్శించారు. తర్వాత సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పావురాలగుట్ట ప్రాంతంలో వైయస్ఆర్ స్మృతివనం, స్థూపావిష్కరణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే వైఎస్ చనిపోయి రెండున్నరేళ్లు దాటినా... పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.
1500 హెక్టార్లలో వైయస్ఆర్ స్మృతివనం ఏర్పాట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల పర్యవేక్షణను రెవెన్యూ, ఫారెస్టు శాఖలకు అప్పగించింది. పావురాలగుట్ట దట్టమైన అభయారణ్యం కావడంతో ఈ ప్రాంతానికి బదులు నల్లకాలువ గ్రామ సమీపంలోని గాలేరు నది వద్ద ఆత్మకూరు, వెలుగోడు ఫారెస్టు రేంజ్ పరిధిలో స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. 13 కోట్ల వ్యయంతో ప్రభుత్వం స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా రూపొందించేలా పనులు ప్రారంభించింది. స్మతివనం ఏర్పాటులో సర్కారు నిర్లక్ష్య వైఖరిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్మృతివనాన్ని సర్కారు నిర్లక్ష్యం చేసినా... తమ గుండెల్లో మహానేత చిరస్థాయిగా నిలిచిపోయారని చెబుతున్నారు అభిమానులు. స్మృతివనాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభించాలని అభిమానులు కోరుతున్నారు.

0 comments:
Post a Comment