గురివింద బాబూ ... జవాబు చెప్పవూ?


2002లో మాదాపూర్‌లో ఎకరా భూమికి APIIC నిర్ణయించిన ధర ఎకరా కోటిన్నర. APIIC బోర్డు నిర్ణయాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాలదన్నారు. రహేజాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ  మేరకు ఇక్కడ ఎకరా ధరను 50 లక్షల రూపాయలకు తగ్గించేందుకు వీలుగా కొత్తగా ఐటీ పాలసీని విడుదల చేశారు. అంతటితో ఆగకుండా... ఈ మొత్తాన్ని కూడా రహేజా చెల్లించనవసరం లేదని బంపర్‌ఆఫర్‌ ప్రకటించారు. అప్పనంగా 110 ఎకరాల భూమిని రిబేట్‌ ఇచ్చేసి ధారత్తం చేసేశారు. ఫలితంగా APIICకి 165 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బాబు హయాంలో జరిగిన ఈ తతంగంపై 2005లో కాగ్‌ తన నివేదికలో ఎండగట్టింది.
ఎల్‌ అండ్‌ టీ. ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన దత్త సంస్థగా పనిచేసింది. బాబు ఏ ప్రాజెక్ట్‌ చేపట్టినా దానిని ఎల్‌ అండ్‌ టీకఏ అప్పగించిన విషయం బహిరంగ రహస్యమే. ఈ సంస్థకు సిమెంట్‌ కర్మాగారం, టౌన్‌షిప్‌ ఏర్పాటుకు ఏకంగా 792 ఎకరాల భూమిని కేవలం ఎకరా 4 వేల రూపాయలకే కట్టబెట్టారు.  బాబు సేవలకు ప్రతిఫలంగా హూదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఉచితంగా నిర్మించి ఇవ్వడం క్విడ్‌ ప్రొ కో. ఇది సీబీఐకి పట్టదెందుకు ?
ఎకరా కోటి రూపాయలు పలుకుతుంటే.. ఎకరా 50 వేల రూపాయలకే ఏకంగా 5,500 ఎకరాలు కట్టబెట్టడం చంద్రబాబుకే సాధ్యమవుతుంది. శంషాబాద్‌ విమానాశ్రయం విషయంలో ఇదే జరిగింది.హైదరాబాద్‌ నడిబొడ్డున 5 కోట్లు పలికే ఎకరా భూమి ధర కేవలం 50 వేల రూపాయలుగా నిర్ణయించారు. అదే రేటుకు 850 ఎకరాలను అపద్ధర్మ సీఎంగా ఉన్న చంద్రబాబు IMG భారత్‌కు కేటాయించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున 5 కోట్లు పలికే ఎకరా భూమి ధర కేవలం 50 వేల రూపాయలుగా నిర్ణయించారు. అదే రేటుకు 850 ఎకరాలను అపద్ధర్మ సీఎంగా ఉన్న చంద్రబాబు IMG భారత్‌కు కేటాయించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు భూబాగోతం చాంతాడంత ఉంటుంది. ఏ ధరల కమిటీ సూచనలతో భూములు కేటాయించారో చంద్రబాబే చెప్పాలి. 2002లో ఎకరాధర రూ.కోటిన్నర
రహేజాతో చంద్రబాబు ఒప్పందం.ఎకరా ధర రూ.50 లక్షలకు తగ్గింపు.ఐటీ పాలసీ పేరుతో కొత్తవిధానం.పైసా లేకుండా 110 ఎకరాలు ధారదత్తం.ఫలితం : APIICకి రూ.165 కోట్ల నష్టం.2005లో ఎండగట్టిన కాగ్‌.బాబు దత్త సంస్థగా ఎల్‌ అండ్‌ టీ.ఎకరా రూ.4 వేల చొప్పున...ఎల్‌ అండ్‌ టీకి 792 ఎకరాల కేటాయింపు.ప్రతిఫలంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ.శంషాబాద్‌లో..
కోటిరూపాయలున్న ఎకరా భూమి ధర రూ.50 వేలకు తగ్గింపు.5,500 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టిన చంద్రబాబు.హైదరాబాద్‌ నడిబొడ్డున...ఐదు కోట్ల రూపాయలున్న ఎకరా భూమి ధర రూ.50 వేలకు తగ్గింపు.850 ఎకరాల భూమిని IMGకి కేటాయించిన బాబు.నాలుగు కోట్ల రూపాయలున్న ఎకరా భూమి ధర రూ.29 లక్షలకు తగ్గింపు.535 ఎకరాలను ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు అప్పగింత

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More